‘’వరుసగా బ్రూస్లీ, ధ్రువ చిత్రాలలో రకుల్ ప్రీత్ సింగ్ ను సెలెక్ట్ చేసుకున్నారు? ఏంటి విశేషం ?’’ మొన్న ఈ ప్రశ్న రామ్ చరణ్ ను అడగితే.. ‘మరో ఆప్షన్ లేక’ అని ఛటుక్కున సమాధానం ఇచ్చాడు చెర్రీ. నిజమే.. ఇప్పుడు టాలీవుడ్ కు హీరోయిన్ల కరువు పట్టుకుంది. ఏ హీరో పక్క చూసిన ఓ ముగ్గురు భామలే అటు ఇటు తిరుగుతున్నారు. కాజల్, తమన్నా ల జమానా అయిపోయిందనే చెప్పాలి. నయనతారది ఒకరకమైన టెక్కు. అనుష్క ఓ జోనర్ సినిమాలకు ఫిక్స్ అయిపోయింది. సమంత సినిమాలు తగ్గించేసింది. ఇప్పుడు లైన్ లో కనిపిస్తున్నది రకుల్ ప్రీత్, కీర్తి సురేష్.
ఇది ఖచ్చితంగా హీరోయిన్ల కరవు కాలమే. చిరు, బాలయ్య , వెంకీ,నాగ్ లు పైన చెప్పిన సినీయర్ హీరోయిన్లతో సర్దుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడేటొచ్చి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, మహేష్, చరణ్, అల్లు అర్జున్,ప్రభాస్.. సినిమాలకు హీరోయిన్ల ఎంపిక కాస్త ఇబ్బందింగా మారుతుంది. వారికి సరి జోడిని వెతకడం పెద్ద టాస్క్ గా మారిపోయింది. వీరి పక్కన కొత్త వారిని తీసుకుంటే ప్రేక్షకులు ఎలా రీసివ్ తీసుకుంటారో తెలీదు. కాస్త క్రేజ్ వుండాల్సిందే. ఇప్పుడు ఆ క్రేజ్ లో కనిపిస్తున్నది రకుల్ ప్రీత్, కీర్తి సురేష్.
ఇందులో రకుల్ ప్రీత్ .. ఆల్రడీ ఓ రౌండ్ పూర్తి చేసింది. ఎన్టీఆర్, చరణ్,బన్నీ, ఇప్పుడు మహేష్ తో ఓ సినిమా చేస్తోంది. పవన్ కళ్యాణ్ బాకీ. ఆ ఛాన్సు తొందర్లోనే కొట్టేయోచ్చు. ఈ రకంగా రకుల్ కూడా ఓ రౌండ్ పూర్తి చేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఆశాకిరణంలా కనిపించింది కీర్తి సురేష్. చేసింది ఒకే ఒక్క సినిమా. గొప్ప గ్లామర్ ఏమీ కాదు. నటన పరకంగా చూసుకున్నా.. ‘శైలజా’లో ఓ రెండు ఎక్స్ ప్రేషన్లు తప్పితే ఎక్కవ కనిపించలేదు. అయితే ఆ బబ్లీ పేస్ నచ్చేసినట్లు వుంది. ఇంకేముంది.! పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్.. సినిమాలకు అడ్వాన్స్ లు వెళ్ళిపోయాయి. హీరోయిన్ల కరువు ఎంతలా వుందో చెప్పడానికి కీర్తి సురేష్ అందుకున్న ఆఫర్లు అద్దం పడుతున్నాయని చెప్పక తప్పదు. ఇపుడు టాలీవుడ్ లో హీరోయిన్లకు స్వర్ణయుగం నడుస్తోందని చెప్పాలి. అవకాశాల ఎంపికలో కాస్త జాగ్రత్తగా వుండి, కొంచెం క్రేజ్ తెచ్చుకుంటే చాలా ‘స్టార్’సినిమాలతో ఓ రౌండ్ కొట్టేయోచ్చు. అయితే అలాంటి క్రేజీ భామలే కరువైపోయారిప్పుడు.