విద్యుత్ కోతలతో సతమతమవుతూ.. కరెంటు ఎపుడు వస్తుందో…ఎపుడు పోతుందో తెలియని పరిస్థితి ఏపీలో నెలకొంది. ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతో బయట కొనే పరిస్థితి కూడా లేదు. దీంతో పరిశ్రమలకు 50శాతం కోత విధిస్తున్నట్లు ట్రాన్స్‌కో అధికారులు అధికారికంగా ప్రకటించారు. దీనితో పాటు వారానికి ఒక రోజు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా పూర్తిగా ఆపేస్తారు. అంటే పవర్ హాలిడే ప్రకటిస్తారు.
ప్రస్తుతానికి రెండు వారాల పాటు విద్యుత్ కోత అమల్లో ఉంటుందని అధికారుల తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీన 235 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగిందని, బయటి మార్కెట్ నుంచి 64 మిలియన్ యూనిట్లను కొనుగోలు చేసినట్లు విద్యుత్ అధికారులు తెలిపారు. గత రెండేళ్ళతో పాటు పోలిస్తే విద్యుత్ డిమాండ్ పెరిగిందని అంటున్నారు. కోవిడ్ తరవాత అనేక పరిశ్రమలు పని చేయడం ప్రారంభించాయని… దీంతో విద్యుత్ డిమాండ్ పెరిగిందని అంటున్నారు. అన్ని విధాలుగా విద్యుత్‌ను సమకూర్చుకున్నా… రోజుకు 40 నుంచి 50 మిలియన్ యూనిట్ల కొరత ఏర్పడుతోందని చెబుతున్నారు.
వేసవిలో ఎంత డిమాండ్ పెరిగినా కరెంట్ కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని నమ్మబలికింది ప్రభుత్వం. చివరికి చేతులెత్తేసింది. పరిశ్రమలకు విద్యుత్ ఆపేయడం వల్ల ఉత్పత్తిపై ప్రబావం పడుతుంది. తమ యూనిట్లను ఇతర చోట్లకు తరలించుకు వెళ్తాయి. ఏపీలో మౌలిక సదుపాయాల కొరత ఉందని ప్రపంచం మెత్తానికి తెలుస్తుంది. ఏపీ పరువు మరోసారి రోడ్డున పడినట్లవుతుంది.