నటసింహ నందమూరి బాలకృష్ణ 102వ చిత్రం ‘జై సింహ’ . నందమూరి బాలకృష్ణ 100 వ సినిమా గౌతమీపుత్ర మైలురాయి గా మిగిలినప్పటికీ, 101 సినిమాగా చేసిన పైసా వసూల్ ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేక పోయింది. 102వ చిత్రం ‘జై సింహ షూటింగ్ ఆఖరు దశలో ఉంది. ప్రస్తుతం దుబాయ్ లో రెండు పాటలను చిత్రీకరించే పనిలో చిత్ర యూనిట్ ఉంది.. కె ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి సి కళ్యాణ్ నిర్మాత.. ఇందులో నయనతార, నటాషా దోషి, హరిప్రియలు హీరోయిన్స్. చింతన్ భట్ సంగీతం సమకూరుస్తున్నాడు.. ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను ఈ నెల 24న నిర్వహించనున్నారు. అమరావతి లో ఈ కార్యక్రమం జరగవచ్చని టాక్.. ఇక ఈ మూవీని సెన్సార్ కోసం ఈ నెల 28న పంపనున్నారు.. జనవరి 12వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమాపై ఇంతవరకు ఎక్కడా ఎలాంటి బజ్ లేదు. కె ఎస్ రవికుమార్ ఫాం లో లేకపోవడం ఒక కారణం ఐతే ప్రమోషన్ల విషయమై సరిగ్గా దృష్టి పెట్టకపోవడం మరొక కారణం. సంక్రాంతి కి వచ్చిన బాలయ్య సినిమాల్లో చాలా వరకూ హిట్ అయ్యాయి. ఈ సారి సంక్రాంతి కి కూడా అఙ్ఞాత వాసి తప్ప మరో పెద్ద హీరో సినిమా లేదు. మరి ఆడియో రిలీజ్ అయిన తర్వాత నుంచైనా ప్రమోషన్ల విషయం లో దర్శకనిర్మాతలు దూకుడు పెంచుతారా? వేచి చూడాలి.