రామ్ చరణ్ నిర్మాతగా కూడా మారాడు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీని స్థాపించాడు. ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు వున్న మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్ర నిర్మాణ భాద్యతలు భుజాన ఎత్తుకున్నాడు. మెగాస్టార్ ని రీలాంచ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఖైదీ నెంబర్ 150 అభిమానులను అలరించింది. ఇప్పుడు మరో భారీ ప్రోజక్ట్ ని నిర్మించడంలో తలమునకలైవున్నాడు. చిరంజీవి.. ‘సైరా’ నరసింహా రెడ్డి’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ జీవిత కథని చిరు తన 151 చిత్రం కోసం ఎంచుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా బాగం షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి రామ్ చరణ్ నిర్మాత. ఇప్పటికే విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్సే వచ్చింది.
అయితే ఈ సినిమా ప్రమోషన్ విషయంలో మాత్రం రామ్ చరణ్ ఎందుకో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. సైరా, ఖైదీ నెంబర్ 150లా సాదా సినిమా కాదు. భారీ సినిమా. చిరంజీవి కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ సినిమా. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తన కెరీర్ లోనే తొలిసారి తెలుగులో ఒక ఫుల్ లెంత్ రోల్ చేస్తున్న సినిమా. బాహుబలి స్థాయి అంచనాలు తీసుకురావాల్సిన సినిమా. కానీ అలాంటి సినిమా విషయంలో రామ్ చరణ్ ఎందుకో అంత యాక్టివ్ గా కనిపించడం లేదు. ఇలాంటి సినిమాలకు అంచలంచలుగా ప్రమోషన్, పబ్లిసిటీ ని డిజైన్ చేయాలి. చేతికందిన ఏ అవకాశాన్ని వదలకూడదు. కాని చరణ్ మాత్రం చాలా లైట్ గా వదిలేస్తున్నాడు. ఇప్పటికే సినిమా నుండి చాలా లుక్స్ బయటికి వచ్చాయి. ఒక్క టీజర్ లో తప్పితే ఆ లుక్స్ లో ఎలాంటి ఇంట్రస్టింగ్ ఎలిమెంట్ లేదు. ఒకే బిజీలో నటీనటుల ఇమేజ్ ని పెట్టి చిన్న యానిమేషన్ ఇవ్వడం తప్పితే కొత్తదనం ఏమీ చూపించడం లేదు. ఆసక్తిని రేకెత్తించడం లేదు.
మొన్నటికి మొన్న అమితాబ్ బచ్చన్ బర్త్ డే కి కూడా ఇలానే చేశారు. అమితాబ్ బచ్చన్ లాంటి సూపర్ స్టార్ నటిస్తున్న ఈ సినిమాని బాలీవుడ్ జనాల్లోకి చొచ్చుకుపోయేలా తీసుకువెళ్ళొచ్చు. బాహుబలి బాలీవుడ్ లో చేసిన సంచలనం అందరికీ తెలిసిందే. ఒక్క బాలీవుడ్ స్టార్ లేకుండానే మంచి ప్రమోషన్ డిజైన్ తో బాలీవుడ్ లో ఆసక్తిని రేపగలిగారు. కాని అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ వున్న సైరా మాత్రం ఆ దిశగా వెళ్ళలేకపోతుంది. అమితాబ్ బర్త్ డే కి కనీసం ఒక పదిసెకెండ్ల టీజర్ అయినా కట్ చేయాల్సింది. కాని చరణ్ మాత్రం ఆ దిశగా అలోచించ లేదు. అందరికీ ఇచ్చినట్లే ఒక ఇమేజ్ కి యానిమేషన్ ఇచ్చి సైరా బిజీలో మిక్స్ చేసి వదిలారు. ఇది కూడా పాత లుక్కే. దీంతో అమితాబ్ బర్త్ డే చప్పగా సాగిపోయింది. అలా కాకుండ ఒక చిన్న టీజర్ లాంటింది రిలీజ్ చేసివుంటే ఖచ్చితంగా బాలీవుడ్ జనాల్లో హాట్ టాపిక్ అయ్యేది సైరా. మరి ఈ విషయంలో చరణ్ మరింత కేర్ తీసుకోవాల్సి వుంది.