మెగా హీరోల సినిమాలకు ‘బజ్’ బాధ

నెల రోజుల్లో నాలుగు మెగా హీరోల సినిమాలు వస్తున్నాయి. బ్రో, భోళా శంకర్, ఆది కేశవ, గాండీవధారి అర్జున. ఐతే వీటన్నిటికి సరైన బజ్ లేకపోవడం సమస్యగా మారింది. పవన్ కళ్యాణ్, సాయి తేజ్ కలసి చేసిన బ్రో, చిరంజీవి భోళా శంకర్ .. ఈ రెండూ రీమేక్ సినిమాలు. ఇప్పటికే ఆ సినిమాలని తమిళ్ వెర్షన్ లో చాలా మంది చూశారు. దీంతో పాటు ఇప్పటివరకూ ఆ సినిమాల నుంచి వచ్చిన కంటెంట్ పెద్దగా బజ్ ని క్రియేట్ చేయలేకపోయాయి. భోళా శంకర్ రెండు పాటలు తేలిపోయాయి. టీజర్ కూడా రొటీన్ గా వుంది. పైగా దర్శకుడు మెహర్ రమేష్ పదేళ్ళ క్రితమే ఫామ్ కోల్పోయాడు. దీంతో ఈ స్వయంగా మెగాస్టార్ చిరంజీవినే భోళా చుట్టూ బజ్ క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో చిరు లీక్స్ ఇస్తున్నారు. ఈ సినిమాలో తాను పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేస్తున్నాని వీడియోలు తయారూచేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇదంతా పవన్ ఫ్యాన్స్ ని కూడా ఇటువైపుగా ఆకర్శించే ప్రయత్నం.

‘బ్రో’ పరిస్థితి కూడా ఇలానే వుంది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ సినిమా కాదనే సంగతి ఫ్యాన్స్ కి కూడా ఒక క్లారిటీ వుంది. పైగా ఆ సినిమాని తమిళ్ లో చూసిన ప్రేక్షకులకు ఆ కథలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏం చేస్తుందో ఒక క్లారిటీ వుంది. నిలబడి డైలాగులు చెప్పే పాత్ర. ఎన్ని మార్పు చేర్పులు చేసినా మూలకథలో మాస్ లేదు. పైగా ఇప్పటివరకూ వచ్చిన రెండు పాటలు హిట్ కాలేదు. ఏవో సోసోగా వున్నాయి. ఈ సినిమాకి మరో ఆకర్షణ త్రివిక్రమ్ డైలాగులు. ఐతే టీజర్ లో పెద్ద డైలాగుల మ్యాజిక్ కనిపించలేదు. పవన్ కళ్యాణ్ లాంటి మాస్ హీరో నుంఛి మరో పది రోజుల్లో సినిమా వస్తుందంటే కనిపించే బజ్ ‘బ్రో’ లో కనిపించడం లేదు.

ఇక వైష్ణవ్ తేజ్ ఆది కేశవ, వరుణ్ తేజ్ గాండీవధారి అర్జున పరిస్థితి కూడా ఇదే. వరుణ్ తేజ్ గత సోలో చిత్రం ‘గని’ డిజాస్టర్. దర్శకుడు ప్రవీణ్ సత్తారు గత సినిమా ‘ఘోస్ట్’ కూడా దారుణమైన ఫలితానని ఇచ్చింది. ఈ ఇద్దరూ కలిసి గాండీవధారి అర్జున చేశారు. ఇప్పటివరకూ ఈ సినిమా నుంచి ప్రేక్షకులు దృష్టిని ఆకర్షించిన ఎలాంటి కంటెంట్ రాలేదు. వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ విషయానికి వస్తే.. ఒక టీజర్ ని వదిలారు. ఓ భారీ పైట్ తప్పితే అందులో ఇంకేం కనిపించలేదు. మంచి బజ్ లో వున్న హీరోయిన్ శ్రీలీల ఇందులో హీరోయిన్ అయినప్పటికీ ఆ క్రేజ్ కూడా ఈ సినిమా విషయంలో కనిపించడం లేదు. మొత్తానికి నెల రోజుల్లో నాలుగు మెగా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నా.. సరైన బజ్ లేకపోవడం ఫ్యాన్స్ ని సైతం కలవరపరుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close