స్టార్ సినిమా అంటే థియేటర్లకు కొదవ ఉండదనుకొంటారు. అయితే.. మహేష్ బాబు – బ్రహ్మోత్సవంకి థియేటర్లు దొరక్కపోవడం ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు సరైనోడు, మరోవైపు సుప్రీమ్ సినిమాలు బ్రహ్మోత్సవంకి అడ్డు తగిలాయి. సూర్య 24 వల్ల కూడా కొన్ని చోట్ల థియేటర్లు దొరకలేదు. నైజాంలో మంచి థియేటర్లే దక్కించుకొన్నా… ఆంధ్రా ప్రాంతంలో మాత్రం బన్నీ సినిమా వల్ల మహేష్ కి థియేటర్లు దొరకలేదు. ఈ మూడు సినిమాల వల్ల అనుకొన్న సంఖ్యకంటే కనీసం 300 స్ర్కీన్లలో బ్రహ్మోత్సవం ఆడిపోయినట్టైంది. ఈ ప్రభావం వసూళ్లపై పడే అవకాశం ఉంది.
అయితే బ్రహ్మోత్సవం రిజల్ట్ సరైనోడు, సుప్రీమ్, 24 చిత్రాలకు కొత్త ఊపు ఇచ్చినట్టైంది. జూన్ 2 వరకూ మరో సినిమా లేదు. బ్రహ్మోత్సవం సందడి మరో మూడు రోజుల్లో తగ్గిపోవడం ఖాయం. దాంతో… ఈ గ్యాప్లో పండగ చేసుకోబోతున్నాయి ఆ మూడు సినిమాలూ. బ్రహ్మోత్సవానికి భయపడి.. థియేటర్లు వదులుకోకపోవడం ఆ సినిమాలకు మంచిదే అయ్యింది.