‘డియర్ కామ్రేడ్’ సత్తా ఏమిటో మొదటి రోజే తేలిపోయింది. యునానిమస్ గా హిట్ టాక్ రాలేదు. సినిమాలో ఏదో లోటనే అభిప్రాయాలు వచ్చాయి. సెకెండాఫ్ బాగా లాగ్ అయ్యిందని వినిపించింది. ఇప్పుడు యూనిట్ మేల్కొంది. దాదాపు పదమూడు నిమిషాలు కట్ చేశారు. ఐతే ఇక్కడ ఇంకొ తప్పు చేశారు. అదనంగా క్యాంటీన్ పాటని యాడ్ చేశారు. ప్రేక్షకుల కోరిక మేరకు అదనంగా క్యాంటీన్ పాటని జోడించామని నిర్మాతలు చెప్పుకొచ్చారు.
ఇది తప్పే. ఈ క్యాంటీన్ పాటతో ‘డియర్ కామ్రేడ్’ కి వచ్చే లాభం ఏమీ ఉండదు. దీనికి కారణం వుంది. ఇప్పటికే సినిమా బాగా లాగ్ అయ్యింది. పదమూడు కాదు .. మరో ముప్ఫై నిమిషాలు కోసి పారేయాలి. విజయ్ తెరపై ఉంటే చూస్తారులే అనే నమ్మకంతో నిడివి పెంచుకొనిపోయారు. కానీ అది రాంగ్ అని తేలింది. ఇప్పుడు అటు ఇటు చేసి పదమూడు నిమిషాలకు కత్తెర పడింది. కొంచెం ట్రిమ్ వెర్సన్ అనుకునేలోపలే మళ్ళీ పాట జోడించారు. పాటని చూసి జనాలు మెచ్చుకుంటారనే రోజులు ఎప్పుడో పోయాయి. పైగా అదేమైన కొత్తపాట..?! నెల రోజుల క్రితమే మొత్తం వీడియోని యూట్యూబ్ లో వదిలారు. యూట్యూబ్ లో పాతైపోయిన ఆ పాటే ఇప్పుడు థియేటర్ లో ఏం కొత్తదనం ఇస్తుంది?! యూత్ టార్గట్ అనుకుంటే.. మళ్ళీ పొరపాటే. ఎందుకంటె యూట్యూబ్ వాడని యూత్ ఎక్కడుంది. వాళ్ళంతా ఎప్పుడో ఈ పాటని చూశేశారు. మళ్ళీ థియేటర్లో అంటే.. బయటికి వెళ్లి సిగరెట్ తాగడానికో, లేదా ఓ ఫోన్ కాల్ మాట్లాడానికో పనికొస్తుందే తప్పా.. అంతకుమించి ఈ పాటతో ఒరిగే లాభం ఏమీ లేదు.