ఎన్నికలకు ముందు లగడపాటి సర్వే సృష్టించిన దుమారం అంతా ఇంతా కాదు. ప్రజా కూటమి వైపు ప్రజల మొగ్గు ఉందని లగడపాటి చేసిన సర్వే రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టించింది. అయితే ఎన్నికల అనంతరం మళ్లీ మీడియా ముందుకు వచ్చిన లగడపాటి తన ఫైనల్ నంబర్స్ ప్రకటించారు.
అయితే ఇప్పటివరకు తాను జరిపిన సర్వేలో అన్నింటిలోకి ప్రజా నాడి పట్టుకోవడంలో అత్యంత కష్టపడిన ఎన్నిక ఇదేనని లగడపాటి ప్రకటించారు. ప్రజల్లో కూడా అటూ ఇటూ ఊగిసలాట కనిపించిందని అందుకే దాదాపు మూడు నెలలపాటు కష్టపడినా కూడా ప్రజల నాడి పట్టుకోవడంలో కాస్త ఇబ్బంది ఎదురైంది అని లగడపాటి అన్నారు. మొత్తం మీద దాదాపు 72 శాతం ఓటింగ్ నమోదయింది అని చెప్పిన లగడపాటి, అధికారిక లెక్కల ప్రకారం ఓటింగ్ శాతం ఎంత ఉందన్నది ఇంకా తెలియాల్సి ఉంది అని చెప్పారు.
లగడపాటి ఫైనల్ రిపోర్ట్ ఇది:
ప్రజా కూటమి : 55 -75 ( 65 + లేదా -10)
ప్రజా కూటమిలోని టిడిపి : 5-9 (7+ లేదా-2)
టిఆర్ఎస్: 25-45 ( 35 + లేదా – 10)
బిజెపి : 5-9 ( 7 + లేదా – 2)
ఎంఐఎం : 6-7
ఈ లెక్కన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు మొగ్గు చూపారని లగడపాటి సర్వే ప్రకారం అర్థమవుతోంది. ఏది ఏమైనా లగడపాటి సర్వే ఎంతవరకు నిజం అవుతుందన్నది మరో నాలుగు రోజుల్లో తెలిసిపోతుంది.