ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి ఈసారి పప్పులో కాలేశారు. ప్రజా కూటమి 65 సీట్లు సాధిస్తుందని, టిఆర్ఎస్ 35 సీట్లకు పరిమితం అవుతుందని, ఎనిమిది నుంచి పది సీట్లలో ఇండిపెండెంట్లు గెలుస్తారని, ఎంఐఎం బీజేపీ ఈ రెండు పార్టీలు కూడా సుమారు 7 సీట్లు సాధిస్తాయని లగడపాటి సర్వే ఫలితాలను ఎన్నికల అనంతరం ప్రకటించారు. అయితే ఈ రోజు ఫలితాలని చూస్తే లగడపాటి సర్వే పూర్తిగా తుస్సుమన్నట్టు అర్థమవుతోంది.
నిజానికి సిపిఎస్ ఎలాంటి కొన్ని సర్వేలు టిఆర్ఎస్కు 94 పైగా స్థానాలు వస్తాయని ప్రకటించినప్పటికీ, జాతీయ సర్వేలన్నీ టిఆర్ఎస్ సునాయాసంగా గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ వెలువరిచినప్పటికీ మొత్తం సర్వేలన్నీ టిఆర్ఎస్ వైపే ఉన్నప్పటికీ తెలుగు ప్రజలలో ఈ ఫలితాల పట్ల ఎంత ఉత్కంఠ ఏర్పడడానికి ప్రధాన కారణం లగడపాటి సర్వే ఫలితాలు. గతంలో అద్భుతమైన ట్రాక్ రికార్డు కలిగిన లగడపాటి ప్రజా కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పడంతో కూటమి నేతల లో కూడా ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. కానీ ఇప్పుడు ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయ్యింది. ప్రస్తుతానికి 90 సీట్లలో టిఆర్ఎస్ కార్యక్రమంలో ఉంటే కాంగ్రెస్ కేవలం 15 సీట్లు మాత్రమే ఆధిక్యంలో ఉంది.
ఎప్పుడు ఎంతో నిక్కచ్చిగా సర్వే ఫలితాలను వెల్లడించే ఆంధ్రా ఆక్టోపస్ ఈసారి ఎందుకు ఇంత దారుణంగా ఫెయిల్ అయ్యాడు అన్న అంశంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈసారి లగడపాటి సర్వే ఎన్ని కొంతమంది స్పాన్సర్ చేయడం వల్ల లగడపాటి అలా చెప్పవలసి కొందరు అంటుంటే, తెలంగాణ ఎమోషన్ని కొట్టుకోవడంలో లగడపాటి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎలా అయ్యాడు ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అయ్యాడు అంటున్నారు మరికొంతమంది. ఏది ఏమైనా లగడపాటి సర్వే ఫలితాలలో ఇదే అత్యంత దారుణమైన ఫలితాలను ఇచ్చిన ఎన్నిక.
– జురాన్ (@CriticZuran)