ఆంధ్రా అక్టోపర్ అనే అప్రకటిత బిరుదును తగిలించుకుని.. సర్వేల పేరుతో…తెలంగాణ రాష్ట్ర సమితిని కంగారు పెడుతున్న… లగడపాటి రాజగోపాల్ కు ఇది కొంచెం ఇబ్బందికరమైన వార్తే. తెలంగాణలో ప్రజాభిప్రాయం కాంగ్రెస్ వైపు ఉందని ఆయన పదే పదే చెబుతున్నారు. దానికి తగ్గట్లుగా… ఆయన కేటీఆర్‌తో సంవాదం కూడా మీడియా సాక్షిగా చేసుకున్నారు. కేటీఆర్ ఒక వాట్సాప్ స్క్రీన్ షాట్ బయటపడితే… లగడపాటి ఐదు బయటపెట్టారు. పోలింగ్ ముందు ఈ టెన్షన్ ఎందుకనుకున్నారో కానీ.. కేటీఆర్ సైలెంటయిపోయారు. అయితే.. లగడపాటికి ఇంట్లోనే సరిగ్గా అభిప్రాయ సేకరణ జరిపినట్లు లేరు అన్న సెటైర్లు పడుతున్నాయి. ఎందుకంటే..ఆయన మాజీ భార్య పద్మ.. టీఆర్ఎస్ను సపోర్ట్ చేస్తున్నారు.
లగడపాటి పద్మ… తెలంగాణ రాష్ట్ర సమితి కండువా వేసుకుని… ఖైరతాబాద్ నియోజకవర్గంలో చురుకుగా ప్రచారం చేశారు. ఆమె వారం పది రోజుల పాటు.. ప్రచారం చేశారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. అయితే లగడపాటి సర్వే బయటకు వచ్చిన తర్వాత మాత్రం.. ఆమె ప్రచారంలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అయిపోయాయి. ఓ వైపు లగడపాటి రాజగోపాల్… తన సర్వేల పేరుతో.. టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఫలితం వస్తుందని చెబుతూంటే.. ఆయన భార్య మాత్రం.. అదే పార్టీకి ఓటయమని ప్రచారం చేస్తున్నారంటూ నెటిజన్లు ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే లగడపాటి మాజీ భార్య … టీఆర్ఎస్కు ప్రచారం చేయడం వెనుక.. రాజకీయం కన్నా.. వ్యక్తిగత సంబంధాలే ఎక్కువ అన్న మాటలు.. టీఆర్ఎస్ నుంచే వినిపిస్తున్నాయి.
ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి… దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. పేరుకు ఖైరతాబాద్ నే కానీ… జూబ్లిహిల్స్‌లో ఉండే.. సంపన్న ప్రాంతాలన్నీ.. ఖైరతాబాద్ నియోజకవర్గం కిందకే వస్తాయి. హై ప్రోఫైల్ వ్యక్తుల ఓట్లన్నీ.. ఆ నియోజకవర్గంలోనే ఉంటాయి. అందరితోఒకరికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దానం నాగేందర్ సతీమణి అనిత … లగడపాటి పద్మ మిత్రులు. స్నేహితురాలి భర్త కోసం… పద్మ ప్రచారంలో పాల్గొన్నారు. అదీ విషయం..! లగడపాటి ఏ పార్టీలో లేకపోయినా… ఆయన టీఆర్ఎస్కు వ్యతిరేకంగా సర్వే చెప్పారు కాబట్టి.. విమర్శలు తప్పవు మరి..!