చాలా సినిమాల్లో కామన్‌గా ఓ సన్ని వేశం ఉంటుంది. ఎవరికైనా.. హీరోకో.. విలన్‌కో కోపం వచ్చి… ఎవరి మీద అయితే కోపం వచ్చిందో.. వారిని అనలేక.. పక్కన ఉన్న వాళ్లని తిట్టేస్తూంటారు. అలాంటి పరిస్థితినే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఎదుర్కొంటున్నారు. తొలి రోజు నిజామాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో… బీజేపీపై… కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దీనికి తీవ్ర స్థాయి అనడం కన్నా… బీజేపీ నేతలను ఎంత దారుణంగా… తీసి పరేశాడో.. ఒక్క డైలాగ్‌ను చూస్తే అర్థమైపోతుంది. లక్ష్మణ్‌కు ఆలోచన ఎలా వచ్చిందో కానీ… ఇంటి కిరాయి కడతామనే హామీని..మ్యానిఫెస్టోలో పెట్టబోతున్నట్లు మీడియాకు చెప్పారు. దానిపైనే కేసీఆర్ సెటైర్లు వేశారు.
మోడీ ప్రతి ఖాతాలో వేస్తామన్న రూ. 15 లక్షలు తీసుకు రావాలన్నారు. అంతటితో ఆగలేదు..” చెంబట్కపోతే.. వాసన రాకుండా కూడా చేస్తామని” చెబుతారని.. ఘోరమైన సెటైర్ వేశారు. దీంతో బీజేపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిపోయినట్లు ఉంది. మళ్లీ కేసీఆర్ పై ప్రతి విమర్శలు చేస్తే.. ఇంకేం మాటలు వినాల్సి వస్తుందనుకున్నారో కానీ.. ఒక్కరంటే.. ఒక్కరూ రెస్పాండ్ అవలేదు. అందుకేనేమో.. ఆ తర్వాత నల్లగొండ, నవపర్తిల్లో సభలు పెట్టినా.. బీజేపీపై.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు కేసీఆర్. కానీ … మూడు రోజుల తర్వాత లక్ష్మణ్ స్పందించారు. కేసీఆర్ భాషపై.. కాదు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భాషపై.
ఉత్తమ్ కుమార్ రెడ్డి.. మంచిభాష మాట్లాడటం లేదని విమర్శించారు. పద్దతిగా మాట్లాడాలని సూచనలు చేశారు. కేసీఆర్ మాట్లాడినట్లు మాట్లాడితే కానీ.. లక్ష్మణ్ నోటికి తాళం పడదేమో..?. ఆ మాత్రం ధైర్యం లేని వాళ్లు .. ఇక కేసీఆర్‌తో ఏం పోటీ పడతారు..? గెలుస్తాం.. ఊడబొడుస్తాం లాంటి ప్రకటనలు చేయడం ఎందుకు..? ఓ ముఖ్యమంత్రి నోట అంతా చీప్ క్వాలిటీ విమర్శలు తమపై వస్తే.. కనీసం.. డిఫెండ్ చేసుకునే లౌక్యం కూడా బీజేపీకి దు. కానీ పెద్ద పెద్ద మాటలు మాత్రం మాట్లాడేస్తూ ఉంటారు.