ఎన్టీఆర్ బయోపిక్ లు ఇప్పుడు… సినిమా రంగంలోనే కాదు.. ఏపీ రాజకీయాలలోనూ కలకలం రేపుతున్నాయి. నందమూరి బాలకృష్ణ… ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది., ఇప్పుడు కొత్తగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో.. రామ్ గోపాల్ వర్మ కూడా.. ఓ సినిమా ప్రారంభించారు. రామ్‌గోపాల్ వర్మ అంటే వివాదం.. ఆయన వివాదాలు లేకుండా సినిమాలు తీయరు. మాట్లాడరు. సినిమా తీసినా మాట్లాడినా వివాదమే. సినిమాలు కూడా.. ఏదో ఒక వివాదాన్ని సృష్టించి కావాల్సినంత పబ్లిసిటీ పొందేలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.
వివాదాలే ఆర్జీవీ సినిమాలకు ముడి సరుకా..?
సాధారణంగా .. సినిమాల ప్రమోషన్లు .. సినిమాలు విడుదలయ్యే ముందు.. విడుదలైన తర్వాత.. సినిమా యూనిట్లు రకరకాల ఈవెంట్లు నిర్వహిస్తూ ఉంటారు. వాటిని పబ్లిసిటీకి వాడుకుటూ ఉంటారు. అయితే ఆర్జీవీ ఏం చేస్తాడంటే.. సినిమా ప్రారంభం నుంచే.. ఇలాంటి వివాదాలు రేపి పబ్లిసిటీ తెచ్చుకుంటాడు. క్రియేటివ్‌గా.. సినిమాకు హైప్ తెచ్చుకుంటే సమస్య ఉండదు. ఉదాహరణకు బాహుబలి విషయంలో రాజమౌళి… చాలా పక్కాగా… పబ్లిసిటీ చేసుకున్నాడు. ఒక్క పైసా ఖర్చు పెట్టకుండా కావాల్సినంత పబ్లిసిటీ తెచ్చుకున్నారు. దానికి కూడా.. ఎంతో ప్లాన్ చేయలేదు. కేవలం.. ” కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపారు..? అన్న ఒక్క ప్రశ్న ఆధారంగానే.. ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ తెచ్చుకున్నారు. ఇది ఆయన క్రియేటివిటి. ఇది తప్పు కాదు. కానీ రామ్ గోపాల్ వర్మ వేరు. ఆయన పార్లమెంటరీ మాటలు మాట్లాడుతారు. అబ్జెక్షనబుల్ స్టేట్మెంట్లు ఇస్తాడు. అందువల్ల.. ఇప్పుడు కూడా అదే పద్దతి అవలంభిస్తున్నారు. సినిమా పేరులోనే వివాదం కనబడుతోంది.
లక్ష్మిపార్వతికి ముందు ఎన్టీఆర్ లేరా..?
ఆర్జీవీ తన సినిమాలకు లక్ష్మీస్ ఎన్టీఆర్ అని పేరు పెట్టడమే పెద్ద వివాదం. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మిపార్వతి ప్రవేశించక ముందు ఎన్టీఆర్ ఉన్నారు. బసవతారకం ఎన్టీఆర్ లేరా..? ఒక్క లక్ష్మీస్ ఎన్టీఆర్ మాత్రమే ఉన్నారా..? . అంటే.. సినిమాను ఎక్కడ్నుంచి మొదలు పెడుతారు..? లక్ష్మిపార్వతి … తన జీవిత చరిత్రను రాస్తానని.. ఎన్టీఆర్ వద్దకు వచ్చినప్పటి నుంచి ప్రారంభిస్తారా..? ఇప్పటి వరకూ ఏం జరిగిందో చెబుతారా..? లేక ఆయన పుట్టినప్పటి నుంచి ప్రారంభిస్తారా..? అప్పట్లో.. లక్ష్మిపార్వతి లేదు. ఇవన్నీ ప్రశ్నలు. అందరికీ తెలిసిందేమిటంటే.. ఎన్టీఆర్ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన ఘట్టం.. లక్ష్మిపార్వతితోనే ప్రారంభమైంది. ఇది చంద్రబాబు నాయుడు ప్రారంభించిన వివాదం అని.. లక్ష్మిపార్వతి అనొచ్చు. లేదు లక్ష్మిపార్వతి ఎన్టీఆర్‌ను, పార్టీని కబ్జా చేయడానికి ప్రయత్నించారని.. టీడీపీ నేతలు, కార్యకర్తలు చెబుతారు. ఏది నిజమైనా.. వివాదాస్పదమైన ఘట్టం మాత్రం అవుతుంది. అందుకే రామ్ గోపాల్ వర్మ దీన్ని తీస్తున్నారు. ఇది తీసినంత మాత్రాన..ఎన్టీఆర్ బయోపిక్ గా చెప్పలేము. బయోపిక్ అంటే… ఓ వ్యక్తి జీవితంలో… ఆటుపోట్లు, ఎగుడుదిగుడులను.. చూపించడమే… బయోపిక్. సినిమాటిక్ మార్పులు చేసుకోవచ్చేమో కానీ.. ఓ బయోపిక్ తీయాలనుకున్నప్పుడు.. మహా వ్యక్తుల జీవిత చరిత్రలను.. వక్రీకరించకూడదు.
ఆర్జీవీ బయోపికి్లో విలన్ చంద్రబాబునాయుడేనా..?
మహానటి సావిత్రి బయోపిక్ సావిత్రిలో… అన్ని కోణాలను చూపించారు. జెమినీగణేశన్ సావిత్రి అని తీయలేదు. సావిత్రిని సావిత్రిగానే తీశారు. అందుకే ఆ సినిమా హిట్ అయింది. అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ వరకు.. వివాదాస్పదమైన ఘట్టాన్ని తీసుకుని సినిమాటిక్ మలుపులు పెట్టుకుని.. తమ ఇష్టం వచ్చినట్లు తీస్తున్నారా అనే దానిపై.. ఆర్జీవీ సమాధానం చెప్పాల్సి ఉంది. ఇంకోక పాయింట్ అంటే.. లక్ష్మిపార్వతిఏ పద్దతిలో చూపిస్తారు. విలన్ గా చూపిస్తారా..?. లక్ష్మిపార్వతి కరెక్ట్.. చంద్రబాబునాయుడు విలన్ అని చెబుతారా..? ఈ ప్రశ్నలకు… ఆర్జీవీ సమాధానం చూపించాలి. బాలకృష్ణ కూడా.. ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నారు. ఆ సినిమాలో లక్ష్మిపార్వతిని పాజిటివ్‌గా చూపించే అవకాశం లేదు. ఎందుకంటే.. ఆ రోజుల్లోనే లక్ష్మిపార్వతికి వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు చంద్రబాబుకు వియ్యంకుడు. అందువల్ల ఈ బయోపిక్‌లో.. లక్ష్మిపార్వతిని చూపించకుండా ఉంటారా..? లేక రామారావు జీవితంలో ఉన్న ఆ వివాదాస్పదమైన పార్ట్‌ను డిలీట్ చేసి చూపుతారా..?
ఎన్టీఆర్ గౌరవాన్ని పెంచేలా బయోపిక్‌లు ఉండాలి..!
ఈ వివాదానికి పులిస్టాప్ పెట్టడానికే.. అన్నట్లుగా.. బాలకృష్ణ బయోపిక్‌ను రెండు పార్టులుగా తీస్తున్నారన్న ప్రచారం ఉంది. ఓ బయోపిక్‌లో కథనాయకుడిగా ఉన్నట్లుగా చూపిస్తారు. ఇందులో వివాదమే లేదు. అద్భుతమైన చిత్రం అయ్యే అవకాశం ఉంది కథనాయకుడిగా రామారావును చూపిస్తే.. ఏ వివాదం రాదు. అది సర్వజన ఆమోదంగా ఉంటుంది. రెండో పార్ట్..మహానాయకుడు ఎన్టీఆర్. రామారావు రాజకీయ ప్రవేశం, సంక్షేమ పథకాలు, జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను ఐక్యం చేసిన తీరు.. అన్ని చూపెట్టి… ముగిస్తారా..? ఏదైనా బయోపిక్‌ను బయోపిక్‌గా తీయాలి. ఎన్టీఆర్‌పై గౌరవాన్ని పెంచేదిగా ఉండాలి. ఎన్టీఆర్ జీవితంలోని వివాదాల్ని వాడుకుని.. రాజకీయంగా ఆర్థికంగా లాభం పొందే ప్రయత్నం చేయకూడదు. తీసే బయోపిక్‌లన్నీ.. ఆయన గౌరవాన్ని పెంచుతాయని ఆశిద్దాం..!