చంద్రబాబు ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారంటూ కనీస ఆధారాలు చూపించకుండా .. ఆస్తుల వివరాలన్నీ తెలుసుకునేలా దర్యాప్తు చేయాలంటూ లక్ష్మిపార్వతి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. ఎవరి ఆస్తుల గురించి ఎవరు తెలుసుకోవాలని ప్రశ్నించింది. అప్పట్లో హైకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకునే పిటిషన్ ను కొట్టివేసిందని, పిటిషన్ లో లక్ష్మీపార్వతి ప్రస్తావించిన అంశానికి విలువ లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. అసలు, ఒకరి ఆస్తుల గురించి తెలుసుకోవడానికి మీరెవరంటూ ప్రశ్నించింది. ఎవరి ఆస్తుల వివరాలు ఎవరికి తెలియాలి? అంటూ వ్యాఖ్యానించింది. లక్ష్మిపార్వతి ఈ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. అక్కడ కొట్టి వేయడంతో హైకోర్టుకెళ్లారు. అక్కడ కూడా అదే తీర్పు రావడంతో సుప్రీంకోర్టుకెళ్లారు. అక్కడా అదే తీర్పు వచ్చింది. దీంతో లక్ష్మి పార్వతి కి ఎదురు దెబ్బ తగిలినట్లయింది.
లక్ష్మి పార్వతి చంద్రబాబు 2004 ఎన్నికలో ఓడిపోయిన తరవాత ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. 1987 నుంచి 2005 వరకు చంద్రబాబు అక్రమంగా తన వ్యక్తిగత ఆస్తులను పెంచుకున్నారంటూ ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు ప్రజాప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా చంద్రబాబు ఆస్తుల కేసు మళ్లీ తెరమీదకు వచ్చింది. ప్రజా ప్రతినిధుల కేసుల విచారణలో భాగంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే విచారణకు ఎన్ని సార్లు పిలిచినా లక్ష్మిపార్వతి హాజరు కాలేదు. చివరికి కోర్టు కొట్టి వేసింది. దీనిపై సుప్రీంకోర్టుకువెళ్లారు.
చంద్రబాబుపై రాజకీయ పార్టీలు అనేక ఆరోపణలు చేస్తూ ఉంటాయి. అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయడం… నోటీసులు జారీ చే్స్తే.. ఇదిగో నోటీసులు వచ్చాయి.. ఇంకేముందని అంతా బయటకు వస్తుందని ప్రచారంచేయడం కామన్ అయిపోయింది. లక్ష్మిపార్వతి కూడా అక్రమంగా ఆస్తులు పెంచుకున్నారని ఎలాంటి ఆధారాలు చూపించకుండానే పిటిషన్ వేశారు. అప్పట్లో వైఎస్ ప్రోద్భలంతో ఆ పిటిషన్ వేశారని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. తర్వాత ఆమె వైసీపీలో చేరారు.