ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేంద్రం ఆయనను గౌరవించడానికి ప్రత్యేకంగా ఆర్బీఐ ద్వారా రూ. వంద నాణెం విడుదల చేస్తోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విడుదల చేస్తున్నారు. ఇరవై ఎనిమిదో తేదీన జరగనున్న ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు ఆయనతో అనుబంధం ఉన్న మొత్తం వంద మంది హాజరవుతున్నారు. ఈ జాబితా చాలా కాలం కిందటే ఫైనల్ అయింది. అందరికీ అధికారికంగా ఆహ్వానాలు వెళ్లాయి. చంద్రబాబు, ఎన్టీఆర్,కల్యాణ్ రామ్ సహా అందరూ వెళ్తున్నారు. పురందేశ్వరికి మొత్తం ఈ కార్యక్రమ క్రెడిట్ దక్కుతుంది.
అయితే లక్ష్మిపార్వతి తనను కూడా ఆహ్వానించాలని రాష్ట్రపతికి లేఖ రాశారు. తాను ఎన్టీఆర్ భార్యనని చెప్పుకున్నారు. ఎన్టీఆర్ భార్యని కాబట్టి తనను కూడా పిలవాలని ఆమె అడుగుతున్నారు. కానీ ఆమెకు ఆహ్వానం పంపనప్పుడే ఆమెను పిలవడం ఇష్టం లేదని … అర్థం అవుతుంది. మరి ఇలాంటి లేఖలు రాయడం వల్ల ఏం సాధిస్తారు అనేది ఆమెకే తెలియాలి. ఎన్టీఆర్ తో లక్ష్మిపార్వతి పెళ్లిని… ఎన్టీఆర్ కుటుంబంలో ఒక్కరూ అంగీకరించలేదు. ఆమెను గుర్తించలేదు. అందుకే ఆమె కు ఆహ్వానాన్ని వ్యతిరేకించి ఉండే అవకాశం ఉంది.
ఎంతో మహోన్నతంగా బతికిన ఎన్టీఆర్.. చివరికి లక్ష్మి పార్వతి వల్ల చివరి రోజుల్లో ఇబ్బంది పడ్డారు. ఆమె చేసిన చర్యలతో కుటుంబసబ్యులూ నలిగిపోయారు. చివరికి ఎన్టీఆర్ ఎలా చనిపోయారన్నది కూడా మిస్టరీగానే ఉంది. చివరికి… వైసీపీలో చేరి ఎన్టీఆర్ కుటుంబసభ్యులపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటారు లక్ష్మిపార్వతి, చివరికి ఎన్టీఆర్ ను అవమానించినా .. .మంచిపనే అంటారు. అయినా సరే తనను పిలవాలంటూ రాష్ట్రపతికి లేఖ రాశారు.