రాంగోపాల్ వర్మ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా మే 1వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్న వర్మ, అదేదో చంద్రబాబు బెదిరింపులకు భయపడి హోటల్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదు కాబట్టే తాను నడిరోడ్డు మీద ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చింది అన్న అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు.
రాంగోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ, “పైపుల రోడ్డులో NTR circle నడి రోడ్డు మీద ప్రెస్ మీట్ మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం. లక్ష్మీస్ ఎన్ టి ఆర్ సినిమా ప్రెస్ మీట్ విజయవాడ నోవాటెల్ హోటల్ లో నిర్ణయించాo,కానీ ఆ హోటల్ వాళ్లు ఎవరో వార్ణింగ్ ఇవ్వటం మూలాన భయంతో కేన్సిల్ చేశేశారు. ఈ విపరీత పరిస్థితుల్లో ట్రై చేసినా అన్ని హోట్టలూ, క్లబ్బుల, మేనేజిమెంట్లు, మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి భయంతో జడిసి పారిపోయారు ” అని రాసుకొచ్చారు.
అయితే ఈ పబ్లిసిటీ స్టంట్లు సినిమాను గట్టెక్కించలేవనే అభిప్రాయం వినపడుతోంది. సినిమా విడుదలకు ముందు ఎంతో హడావిడి చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో లో కోర్టు ఆదేశాల కారణంగా విడుదల కాలేక కేవలం తెలంగాణ లో విడుదలైన ఈ సినిమాకు అక్కడ కూడా ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రమే లభించింది. కత్తి మహేష్ లాంటి మేధావి విమర్శకులు ఈ సినిమాను విపరీతంగా పొగుడుతూ పోస్ట్ పెట్టినప్పటికీ, సినిమా అటు జనాలని కానీ ఇటు విమర్శకులను కానీ ఆకట్టుకోలేకపోయింది. పైగా చాలామంది సినిమాని ఫేస్బుక్ లాంటి మాధ్యమాలలో పైరసీ వెర్షన్ చూసేశారు. మరి ఈ లెక్కన వర్మ పబ్లిసిటీ స్టంట్లు, హడావిడి సినిమాకు ఏ మాత్రం ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాలి.
పైపుల రోడ్డులో NTR circle https://t.co/jvva4KotsW… దగ్గర today sunday 4 pm
నడి రోడ్డు మీద ప్రెస్ మీట్మీడియా మిత్రులకి, ఎన్ టి ఆర్ నిజమ్తైన అభిమానులకి ,నేనంటే అంతో, ఇంతో ఇష్టమున్న ప్రతీవారికీ, నిజ్జాన్ని గౌరవించే ప్రజలందరికీ మీటింగ్లో పాల్గొన్నటానికి ఇదే నా బహిరంగ ఆహ్వానం pic.twitter.com/vasqMPngil
— Ram Gopal Varma (@RGVzoomin) April 28, 2019