ఎన్నికల సంఘం… రెండు రోజుల ముందుగానే… అన్ని జిల్లాల కలెక్టర్లకు… సమాచారం ఇచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం… క్లారిటీ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా అదే చెప్పారు. …మొత్తంగా ఏ రాజకీయ నాయకుడి బయోపిక్ అయినా సరే… ఎన్నికల కోడ్ ముగిసిన అనంతరం మాత్రమే… విడుదల చేయాలనేది.. ఆ క్లారిటీ. ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్కు కూడా వర్తిస్తుందని.. ఈసీ స్పష్టం చేసింది. అయితే.. మే ఒకటో తేదీనే విడుదల చేస్తామని చెప్పిన… లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర బృందం తన పంతాన్ని నెరవేర్చుకుంది. ఏపీలో.. రెండు ధియేటర్లలో ఈ సినిమాను విడుదల చేశారు. షోలు పడిన తర్వాత.. విషయం తెలిసిందని అమాయకత్వం నటిస్తూ… నిలిపివేశారు. ఇలా షోలు పడిన ధియేటర్లు రెండూ కడప జిల్లాలోనే ఉన్నాయి.
కడప నగరంలోని రాజా థియేటర్లో, పోరుమామిళ్లలోని వెంకటేశ్వర థియేటర్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని మార్నింగ్ షో వేశారు. ఈ విషయం తెలిసి జిల్లా అధికారులు.. ధియేటర్ల యాజమాన్యాలకు ఫోన్ చేశారు. బ్యాన్ చేసిన విషయం తమకు తెలియదంటూ.. వారు.. నటించి… మిగిలిన షోలను రద్దు చేశారు. కానీ… కావాలనే… ఆ షోలను ప్రదర్శించారనే.. విషయం…సులువుగానే అర్థం అయిపోతుంది. ఎన్నికల సంఘం.. చర్యలు తీసుకోదనే భరోసా ధియేటర్ యాజమాన్యానికి వచ్చిందని… పైగా వాళ్లు వైసీపీ నేతలకు సన్నిహితులని.. స్పష్టం కావడంతో.. పంతం నెగ్గించుకోవడానికి.. సినిమాను రెండు ధియేటర్లలో రిలీజ్ చేశారని చెబుతున్నారు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు పర్మిషన్ లేదనే సంగతి అధికారులకు మాత్రమే కాదు.. సినీ పంపిణీ రంగంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఆ సినిమాను ప్రదర్శిస్తే… కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న విషయమూ… పంపిణీ దారులకు.. ఎగ్జిబిటర్లకు తెలుసు. అందకే అందరూ వెనుకడుగు వేశారు. కానీ… వైసీపీ నేతల పంతం మాత్రం వేరే. ఎలా అయినా సరే షో పడాల్సిందేనని వారు టార్గెట్. దాని కోసం.. ఈసీని కూడా లైట్ తీసుకున్నారు. నిజంగా.. ఆపేయాలనుకుంటే.. షో మొత్తం వేసే వారు కాదు. అధికారులు ఫోన్ చేసినప్పుడు.. ఇంటర్వెల్ కాక ముందు షో నిలిపివేసేవారు. షో మొత్తం వేసేవారు కాదన్న అభిప్రాయాలు ఉన్నాయి.