ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో రాజధాని అమరావతిలో చంద్రబాబు సర్కార్ భూసేకరణను పునః ప్రారంభించింది. రాజధాని నిర్మాణం కోసం గతంలోనే భూముల సేకరణ ప్రక్రియ మొదలైనా, మరో 4వేల ఎకరాలు సేకరించాల్సి ఉండగా…. జగన్ సర్కార్ అధికారంలోకి రావటంతో ఆ ప్రక్రియను నిలిపివేసింది.
తాజాగా, అప్పుడు నిలిచిపోయిన ప్రక్రియను తిరిగి మొదలుపెట్టారు. రెండ్రోజుల్లో రెండున్నర ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో తీసుకోగా… వేగవంతం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఇప్పటి వరకు 25,398మంది రైతుల నుండి 34,281ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో సేకరించారు. ఇప్పటికే గతంలో నిలిచిపోయిన నిర్మాణాలను అధికారులు పరిశీలించారు. 80శాతం పూర్తైన భవనాలను మరో ఏడాదిలో రెడీ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.
Also Read : ఏపీ రైల్వే బడ్జెట్ 9వేల కోట్లు… ఒక్క అమరావతికే 2వేల కోట్లు!
ఇక, ఉండవల్లి, పెనమాక, రాయపూడి, మందడం, వెలగపూడి, నిడమర్రు ప్రాంతాల్లో ఇంకా భూమిని సేకరించాల్సి ఉంది. పూలింగ్ లో భూమి ఇచ్చే వారికి రిటర్న్ ప్లాట్స్ కూడా ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజధాని ప్రాంతంలో, సీఆర్డీఏలో సరిపడ స్టాఫ్ లేకపోవటంతో ఎదురవుతున్న ఇబ్బందుల దృష్ట్యా… ఇతర శాఖల నుండి తాత్కాలిక పద్ధతిలో సిబ్బందిని తీసుకునేందుకు సీఆర్డీఏ కమిషనర్ భాస్కర్ ధరఖాస్తులు కూడా ఆహ్వానించారు.