రూ. 200 కోట్ల విలువైన స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై కబ్జా కేసు హైదరాబాద్ లో నమోదు అయింది. కొండాపూర్ లో ఉన్న స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారని అనిల్ రెడ్డి, నరసింహారెడ్డి అనే వ్యక్తులు ఫిర్యాదు చేశారు. మొదట తమదే స్థలం అని వారే కబ్జా చేయడానికి ప్రయత్నించారని వైడ్ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలతా రెడ్డి పోలీసులుక ఫిర్యాదు చేశారు.
పోలీసులు ఇరు వర్గాల ఫిర్యాదులను తీసుకుని.. స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకు రావాలని ఇరు వర్గాలను ఆదేశించారు. వారు తీసుకు వచ్చిన డాక్యుమెంట్ల ఆధారంగా.. వైవీ సుబ్బారెడ్డితో పాటు ఆయన భార్యకు స్థలానితో సంబంధం లేకపోయినా దౌర్జన్యానికి పాల్పడ్డారని పోలీసులు కేసు నమోదు చేశారు.కబ్జా కేసులు పెట్టారు. ఏ వన్ గా వైవీ సుబ్బారెడ్డిని, ఏ టు గా స్వర్ణలతారెడ్డిని చేర్చారు.
వైఎస్ మొదటి సారి సీఎం అయినప్పుడు హైదారాబాద్ మొత్తం వైఎస్ కుటుంబసభ్యుల దందాలే నడిచేవి. స్థలాలు, పొలాలతో వారి సెటిల్మెంట్లు, కబ్జాలు ఓ రేంజ్ లో ఉండేవి. అప్పట్లో అసలు వైవీ సుబ్బారెడ్డి రాజకీయాల్లో ఉండేవారు కాదు. ఆయన పూర్తిగా ఇలాంటి పనులకు అంకితమయ్యేవారు. వైఎస్ చనిపోయిన తరవాత రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ సీఎం కాక ముందు మధ్యతరగతి వ్యక్తిగా ఉండే సుబ్బారెడ్డి ఆ తర్వాత వేల కోట్లకు పడగలెత్తాడు. ఆయనపై ఉన్న ఆరోపణలు లెక్కలేనన్ని. ఏ వ్యాపారాలు చేయకుండా అంత పెద్ద మొత్తంలో ఎలా సంపాదిస్తాడోనని ప్రకాశం జిల్లా నేతలు కూడా గుసగుసలాడుకుంటారు.