మండలిలో బలం ఉంది .. ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తామని హెచ్చరికలు జారీ చేసిన వైసీపీ అధినేత జగన్ కు కనీస అవగాహన లేకపోవడంతో మొదటికే మోసం వచ్చింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ తాము అనుకున్న బిల్లుల్ని సులువుగా పాస్ చేసేసుకుంది. శాసనమండలిలో కూడా బిల్లులు పాస్ అయిపోయాయి. ఆ బిల్లులు రెండూ వైసీపీకి ముఖ్యమనవే. అందులో ఒకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. మరొకటి ఎన్టీఆర్ ఆరోగ్యవిశ్వవిద్యాలయం పేరు యథాతథ స్థితికి తీసుకు రావడం.
Read Also : అయోమయం..జగన్నాథం..!
శాసనమండలి సభ్యుల్ని కూడా తీసుకుని ఢిల్లీకి పోయారు జగన్. ఇక్కడ శాసనమండలి చైర్మన్ మాత్రం మండలికి హాజరు కాక తప్పలేదు. అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు మండలికి వచ్చాయి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును గతంలోలా ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లులను ఆమోదించేశారు. శాసనమండలి చైర్మన్ వైసీపీకి చెందిన వ్యక్తే అయినా మండలికి హాజరైన వారంతా ఆమోదించడంతో ఆయనకూ పాస్ చేయక తప్పలేదు. ఈ విషయం తెలియడంతో వైసీపీ పెద్దలు షాక్ కు గురయ్యారు.
ఢిల్లీలో ధర్నా చేసి సాధించిందేమైనా ఉందో లేదో కానీ.. ఇక్కడ మండలిలో ఇరగదీస్తామని చేసిన హెచ్చరికలు కూడా వర్కవుట్ కాలేదు. కీలకమైన బిల్లులు పాస్ కావడంతో ఇక చేసేదేమీ లేదు. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయడంతో వైసీపీ పెద్ద కుట్ర చేయబోయిందని తాము కాపాడామని.. టీడీపీ ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది