కెరీర్ ని మలుపు తిప్పడానికి ఒక్క హిట్ చాలు. అలాంటి హిట్ ‘ఉప్పెన’తో కొట్టింది కృతిశెట్టి. తెలుగులో ఇది తనకు తొలి సినిమా. అంతకుముందు హిందీ సినిమా సూపర్ 30లో ఓ చిన్న క్యారెక్టర్ చేసింది. ఉప్పెన సక్సెస్ మాత్రం ఆమెని టాప్ లీగ్ లో నిలబెట్టింది. బేబమ్మ క్యారెక్టర్ యూత్ ఫేవరట్ అయ్యింది. ఇక వరుసగా అవకాశాలు వచ్చాయి.
రెండో సినిమా గా చేసిన శ్యాం సింగారాయ్ హిట్టే. కానీ ఆ క్రెడిట్ అంతా సాయి పల్లవి ఖాతాలో పడిపోయింది. మూడో సినిమా బంగార్రాజు నుంచి కృతి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాతో పాటు వారియర్, మాచర్ల.. ఆ అమ్మాయి.. కస్టడీ, రీసెంట్ గా వచ్చిన ‘మనమే’ వరకూ అన్నీ ఫ్లాపులే. దానికి తోడు కృతి స్క్రీన్ ప్రజెన్స్ కూడా అంతంత మాత్రంగానే సాగింది. కథానాయిక పాత్రని సరిగా డిజైన్ చేయకపోవడం కూడా కృతి కెరీర్‌ని వీక్ జోన్లోకి నెట్టేసింది. కథల ఎంపికలో కృతి చేసిన తప్పులు ఆమె ఇమేజ్‌ని అధః పాతాళానికి తొక్కేశాయి.
ఇప్పుడు కన్నడ లో అడుగుపెట్టింది కృతి. టివోనో థామస్ ‘ఏఆర్ఎం’లో మెరుస్తోంది కృతి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని తెలుగు లో విడుదల చేయనుంది. సెప్టెంబర్ 12న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఆసక్తిని పెంచింది. కృతికి హిట్ చాలా అవసరం. తన కెరీర్ బూస్ట్ అవ్వాలంటే సక్సెస్ కొట్టాల్సిందే. ఆ సక్సెస్ ఈ సినిమాతో వస్తుందని కృతి శెట్టి గట్టిగా నమ్ముతోంది. ఓరకంగా కృతికి ఇదే లాస్ట్ ఛాన్స్. ‘మనమే’ ఫ్లాప్ అయినా, కృతి కాస్త గ్లామరస్‌గానే కనిపించింది. అది కృతికి మరో ప్లస్ పాయింట్.