వాలంటీర్లను పెట్టి నాలుగేళ్లయింది. వారి చట్టబద్ధతపై ఎప్పుడూ రాని సందేహాలు ఇప్పుడు వస్తున్నాయి. కోర్టులో పిటిషన్లు పడ్డాయి. వాటిపై విచారణ ఇప్పటికి కొలిక్కి వస్తోంది. వాలంటీర్ల చట్టబద్ధత గురించి చెప్పాలని హైకోర్టు సెర్ఫ్ సీఈవోను ఆదేశించింది. వాలంటీర్లు అన్ని వ్యవహారాల్లోనూ కీలకంగా ఉంటున్నారు. పథకాల లబ్దిదారులను ఎంపిక చేయడం… తీసేయడం దగ్గర్నుంచి … చాలా పనులు చేస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించిన అతి సున్నిత సమాచారం వారి వద్ద ఉంటోంది. దీని చట్ట విరుద్ధమని విపక్షాలు ఎప్పట్నుంచో ఆరోపిస్తున్నాయి.
అయితే ఇప్పుడు వాలంటీర్ల చట్టబద్ధతపై కోర్టులో విచారణ జరుగుతోంది. వారు చట్టబద్ధమేనని ప్రభుత్వం చెప్పలేదు. వారు సేవకులు ప్రభుత్వం చెబుతుంది. అంటే వారు చేస్తున్న పనులు చట్ట విరుద్ధమని కోర్టుకు ప్రభుత్వం చెప్పక తప్పదు.. లేదు వారి సేవలు చట్టబద్దమేనంటే.. దాని కోసం చేసిన చట్టాన్ని చూపించాల్సి ఉంటుంది. కానీ అలాంటి చట్టమేదీ లేదు. ఇదే సమయంలో ఇటీవల రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే వాలంటీర్లకు గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
వాలంటీర్ల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండటం లేదని.. వారి స్థానంలో గృహసారధుల్ని పార్టీ తరపున నియమించారు. ప్రతి యాభై ఇళ్లకు ఇద్దరు గృహసారధుల్ని నియమించారు. ఇక మొత్తం వారే చూసుకుంటారు. అలాగే సచివాలయ కన్వీనర్లను కూడా నియమించారు. అవి పార్టీ వ్యవస్థలు . జీతం ఇవ్వాల్సిన వాలంంటీర్ వ్యవస్థకు గండికొట్టడం ఖాయమని.. ఇందుకు కోర్టు విచారణను అడ్డం పెట్టుకోబోతున్నారన్న అనుమానం వాలంటీర్లలోనే కనిపిస్తోంది.