బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ డైరక్షన్ లో సాక్ష్యం సినిమా. ఈ సినిమా పూర్తయిపోయింది. మంచి బజ్ వచ్చింది. టీజర్, ట్రయిలర్ లు ఆకట్టుకున్నాయి. అంతా బాగుంది. విడుదలకు ఇంకో పది పన్నెండు రోజులు వుంది. అసలు టెన్షన్ ఇప్పుడు మొదలవుతున్నట్లు తెలుస్తోంది.
సినిమా నిర్మాణానికి దాదాపు 40 కోట్లకు ఫైగా వ్యయం అయింది. అయితే శాటిలైట్, డిజిటల్, థియేటర్ రైట్స్ అన్నీ కలిపి 40 కోట్లకు పైగా బిజినెస్ అయింది. అందువల్ల అక్కడికి అక్కడ సరిపోయింది.
కానీ టెన్షన్ దేనికంటే, జయజానకీ నాయక టైమ్ లో కూడా ఇలాగే జరిగింది. నిర్మాతకు అంతా సేఫ్ అన్నట్లు కనిపించింది. కానీ విడుదల ముందు రోజుకు వచ్చేసరికి అడ్వాన్స్ లు ఇచ్చిన బయ్యర్లలో కొందరు నానా ఇబ్బంది పెట్టారు. అంత రేటు పెట్టలేమని, అంత ఇవ్వలేమని, తమకు వద్దని ఇలా.
దాంతో నిర్మాత లాస్ట్ మినిట్ టెన్షన్లు చాలా పడ్డారు.కొన్ని ఏరియాలు అప్పటికప్పుడు స్వంతంగా విడుదల చేసుకోవాల్సి వచ్చింది. మొత్తం మీద డెఫిసిట్ రిలీజ్ తప్పలేదు. ఆ తరువాత నష్టాలు తప్పలేదు.
బోయపాటి లాంటి డైరక్టర్ వున్న సినిమాకే బయ్యర్లు చివరి నిమషంలో అలా ప్లేట్ ఫిరాయించారు. మరి శ్రీవాస్ డైరక్ట్ చేసిన సినిమా ఇది. చివరి నిమిషయంలో ఏమవుతుందో అని టెన్షన్ నిర్మాత అభిషేక్ ను వెన్నాడుతున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇదిలా వుంటే సినిమా పబ్లిసిటీ విషయంలో బెల్లంకొండ స్టయిల్ కు నిర్మాత అభిషేక్ స్టయిల్ కు మ్యాచ్ కావడం లేదని తెలుస్తోంది. ఇప్పటి దాకా పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు. 20 నుంచి మొదలుపెడదాం అని చూస్తున్నారు. దీంతో హీరో తండ్రి బెల్లంకొండ రంగ ప్రవేశం చేసి, తానే కొంత పబ్లిసిటీ వ్యవహారాలు చూసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.