నాగశౌర్య సినిమా ‘ఛలో’ శుక్రవారం విడుదల అవుతోంది. అంతకు ముందే.. అంటే ఈరోజు రాత్రి హైదరాబాద్‌లో ప్రీమియర్ షో పడబోతోంది. ఈ సినిమాపై నాగశౌర్య చాలా నమ్మకంతో ఉన్నాడు. ప్రోమోలు ప్రామిసింగ్‌గా ఉన్నాయి. ట్రైలర్లలో కనిపించిన విషయం సినిమాలోనూ ఉంటే… శౌర్యకి హిట్ పడిపోవడం ఖాయం. కాకపోతే.. ఛలోకి చివరి నిమిషంలో తలనొప్పులు ఎక్కువయ్యాయి. లాబ్ క్లియరెన్స్రావడానికి ‘ఛలో’ చాలా కష్టపడిందని టాక్. ఎందుకంటే… ‘ఛలో’ టాక్ బాగున్నా.. బిజినెస్ పరంగా వీక్‌గా ఉంది. అడ్వాన్సులు పెద్దగా రాలేదు. లాబ్ క్లియరెన్స్ విషయంలో నిర్మాత ఇబ్బంది పడినట్టు, నిర్మాత కోటగిరి వెంకటేశ్వరరావు హామీతో లాబ్ క్లియరెన్స్ దక్కినట్టు సమాచారం. మొత్తానికి ‘ఛలో’కి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. రేపు రవితేజ ‘టచ్ చేసి చూడు’తో ఢీ కొట్టబోతోంది. రవితేజ సినిమా కంటే… ‘ఛలో’పైనే అంచనాలు ఎక్కువగా ఉండడం విశేషం. రవితేజ సినిమా అటూ ఇటూగా ఉంటే.. మార్కులన్నీ ‘ఛలో’కే.