ఈ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల్లో ‘నా సామిరంగ’ ఒకటి. నాగార్జునని ఫుల్ మాస్ అవతార్‌లో చూపిస్తున్న సినిమా ఇది. నరేష్, రాజ్ తరుణ్‌లు కూడా ఉండడం అదనపు ఆకర్షణ కానుంది. సంక్రాంతికి సరైన సినిమా కూడా. అయితే… నా సామి రంగకు లాస్ట్ మినిట్ టెన్షన్స్ పట్టుకొన్నాయి. ఈ సినిమా ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. జనవరి 5 వరకూ.. షూటింగ్ ఉంది. అంటే విడుదలకు వారం రోజుల ముందు వరకూ పని పూర్తయ్యే ఛాన్స్ లేదు. ఆ తరవాత పోస్ట్ ప్రొడక్షన్స్ ఉంటాయి, ప్రమోషన్స్ ఉంటాయి… మరి ఈ టెన్షన్లన్నీ ఈ సినిమా ఎలా దాటుకొని వస్తుందో..?
కాకపోతే… ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లోనూ సంక్రాంతికే విడుదల చేయాలన్నది నాగార్జున ప్లాన్. ఆయనకు సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. అందుకే ఆఘమేఘాలపై ఈ సినిమా పనులు పూర్తి చేస్తున్నారు. ఓవైపు… పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ప్రమోషన్లని కూడా మెల్లమెల్లగా మొదలెట్టే ఆలోచనలో ఉంది. జనవరి 1 నుంచి… పూర్తి స్థాయిలో ప్రచారం ప్రారంభించబోతున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి శ్రీనివాస చిట్టూరి నిర్మాత.