అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన భామ లావణ్య త్రిపాఠి. ఆ సినిమాలో మిధున పాత్రలో అలరించిన లావణ్య పక్కింటి అమ్మయిలా తెలుగు ప్రేక్షకుల మనసు గెల్చుకుంది. ఇక భలే భలే మగాడివోయ్ సినిమాలో నందనగా అదరగొట్టేసింది. సోగ్గాడికి చూడచక్కని సీతగా మెరుపులు మెరిపించింది. అయితే ఇన్ని చేసినా తనను హోమ్లీ పాత్రలకే పరిమితం చేస్తున్నారని తాను కూడా గ్లామర్ పాత్రల్లో మెప్పిస్తానని అంటుంది లావణ్య.
తనను తానుగా గుర్తించబడే పాత్రల్లో నటించాలని తన కోరిక అంటూ చెప్పుకొచ్చిన లావణ్య సోగ్గాడే చిన్ని నాయనాలో నాగార్జున భార్య పాత్రలో చేయవద్దని చాలా మంది సలహా ఇచ్చారని కాని వాటిని తాను లెక్క చేయలేదని చెప్పింది. సినిమా అన్నాక అన్ని రకాల పాత్రల్లో నటించాలని అయితే చేసిన మూడు సినిమాల్లో సగటు అమ్మాయి పాత్రలో నటించి మెప్పించిన ఈ చిన్నది ఇకనుండి తాను కూడా గ్లామర్ షో చేసేందుకు సిద్ధమే అంటూ దర్శక నిర్మాతలకు సిగ్నల్ ఇస్తుంది.
ప్రస్తుతం అల్లు శిరీష్ శ్రీరస్తు శుభమస్తు సినిమాలో నటిస్తున్న లావణ్య.. శ్రీనువైట్ల, వరుణ్ తేక్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో కూడా ఓ హీరోయిన్ గా ఎంపికైందని టాక్. సో మొత్తానికి గ్లామర్ షో చేయకుండానే వరుస సినిమాలు చేస్తున్న లావణ్య ఇక స్కిన్ షో చేయడం మొదలు పెడితే ఆమెను ఆపడం ఎవరి వల్లా కాదేమో..!