ప్రేమ పిచ్చి, డేటింగ్ మోజు… ఇవన్నీ టాలీవుడ్ భామలకూ అలవాటు పడిపోయాయి. ఏదో నాలుగు సినిమాలు చేశామా, వెళ్లిపోయామా.. అని కాదు. లవ్ మ్యాటర్లో కూడా దిగి.. పీకల్లోతు పబ్లిసిటీ తెచ్చుకోవాలని, ఎప్పుడూ గాసిప్పుల్లో మునిగితేలాలని భారీ భారీ స్కెచ్చులు వేసుకొంటున్నారు ముద్దు గుమ్మలు. అయితే నేను ఆ టైపు కాదంటోంది లావణ్య త్రిపాఠీ. నవతరం కథానాయికలలో జోరుమీదున్న భామ లావణ్య. ఈమధ్య లావణ్య కూడా లవ్వాటలో మునిగిపోయిందన్న గుసగుసలు వినిపించాయి. వీటిపై లావణ్య స్పందించింది. ”ప్రేమలో పడిపోయానంటున్నారు.. నాకు నిజంగా బోయ్ ఫ్రెండ్సే లేరు. నా స్నేహితులంతా అమ్మాయిలే. అబ్బాయిలతో పరిచయాలు పెంచుకోవడం.. వాళ్లని స్నేహితులుగా మార్చుకోవడం నాకేమాత్రం నచ్చవు” అంటోంది బుద్దిగా.
సినిమాలు, కుటుంబం తప్ప తనకు వేరే ప్రపంచం తెలియదంటోంది లావణ్య. ఇంట్లోవాళ్లకు చెడ్డపేరు తీసుకొచ్చే పని ఎన్నటికీ చేయదట. ”గాసిప్పుల్లో నిలవాలంటే లవ్లోనే పడాలా.. అందుకు చాలా మార్గాలున్నాయి. అయినా నేను గాసిప్పుల గురించి పట్టించుకోను. నాకొచ్చే సినిమాల్ని సరిగ్గా చేసుకొంటూ చాలు. వేరే పాపులారిటీ అక్కర్లెద్దు” అని క్లారిటీ ఇచ్చేసింది.