అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది లావణ్య త్రిపాటి.. ఆ సినిమాలో మంచి అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమ్మడు రీసెంట్ గా భలే భలే మగాడివోయ్ హిట్ తో మంచి జోష్ మీదుంది. అయితే హీరోయిన్స్ అందరిది ఒకదారి అయితే లావణ్యని మరో దారి.. చాన్స్ దొరికితే చాలు స్కిన్ షోతో రెచ్చిపోతాం అని అంటున్న హాట్ భామలున్న ఈ రోజుల్లో కేవలం తన టాలెంట్ తోనే ఆఫర్లను చేజిక్కించుకుంటుంది లావణ్య. అందం అభినయం సొంతమైన ఈ భామ ఎక్స్ పోజింగ్ కు ఆమడ దూరంలో ఉంటూ వచ్చింది.
అయితే సినిమాల్లో ఇంత పద్ధతిగా కనిపించే లావణ్య ఫ్రెండ్స్ తో వేసే జాలి ట్రిప్లో మాత్రం అందాల ప్రదర్శనతో కనువిందు చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో పడేసరికి ఆమెను ఆపడం ఎవరి వల్లా కావట్లేదు. అందుకే ఫ్రెండ్స్ తో జాలీ ట్రిప్స్ వేసేస్తుంది. ఇండోనేషియా దీవుల్లో బాలి ప్రాంతంలో లావణ్య స్నేహితులతో విహార యాత్రకు వెళ్లింది. అక్కడ అమ్మడు రకరకాల డ్రెస్సులతో కనబడి అందరికి షాక్ ఇచ్చింది.
ఇప్పటి వరకు స్కిన్ షోకు నో అని చెప్పిన లావణ్య ఈ ట్రిప్లో మాత్రం స్విమ్ సూట్లో కనిపించి అందరిని ఆశ్చర్యపరచింది. సాధారణంగా అందరు హీరోయిన్స్ సినిమాల్లో రెచ్చిపోయి బయట మాత్రం దాచుకుంటారు.. కాని లావణ్య దానికి విరుద్ధంగా సినిమాల్లో మంచి పాత్రలు వేస్తూ బయట స్కిన్ షో చేస్తుంది. మరి అమ్మడు ఇందతా తను కూడా హాట్ గా నటించడానికి రెడీ అని సిగ్నల్ ఇవ్వడానికే అంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఏ దర్శకుడు లావణ్య త్రిపాటిలోని అందాలను బహిర్గతం చేస్తాడో చూడాలి. ప్రస్తుతం లచ్చిందేవికి ఓ లెక్కుంది, సోగ్గాడే చిన్ని నాయన సినిమాలు చేస్తున్న లావణ్య రెండు గ్యారంటీ హిట్ అని సన్నిహితులతో చెప్తుందట.