ఇద్దరు హీరోయిన్ల ఫార్ములాని వాడుకోని సినిమా లేదేమో..? స్టార్ హీరో అయినా, అప్పుడే బుడి బుడి అడుగులు వేస్తున్న యువ కథానాయకుడైనా ఇద్దరు భామలతో ఆడిపాడాలని తహతహలాడిపోతుంటాడు. మాస్ మహారాజా రవితేజ కూడా నారీ నారీ నడుమ మురారీ లాంటి సినిమాలెన్నో చేశాడు. ఇప్పుడు చేస్తున్న… టచ్ చేసి చూడు కూడా అదే ఫార్ములాలో సాగే కథ. ఓ కథానాయికగా రాశీఖన్నాని ఎంచుకొన్నట్టు చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. మరో కథానాయికగా లావణ్య త్రిపాఠీకీ ఛాన్స్ దొరికింది. విక్రమ్ సిరి అనే రచయిత ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలపు బుజ్జి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఫిబ్రవరిలో షూటింగ్ మొదలుతుంది. రాశీ ఇది వరకే రవితేజతో బెంగాల్ టైగర్‌లో మెసింది. తనకి రవితేజతో రెండో సినిమా ఇది. లావణ్య త్రిపాఠీ కి మాత్రం రవితేజతో కలసి నటించడం ఇదే తొలసారి. ఫిబ్రవరిలో చిత్రీకరణ మొదలెడతారు. ఆగస్టు నాటికి ఈ సినిమాని పూర్తి చేయాలన్నది దర్శక నిర్మాతల లక్ష్యం.
బెంగాల్ టైటర్ నుంచి ఇప్పటి వరకూ ఖాళీగానేఉన్నాడు రవితేజ. 2016లో ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. కాస్త ఆలస్యమైనా మంచి ప్రాజెక్ట్‌తోనే వస్తున్నట్టు అనిపిస్తోంది. టైటిల్ క్యాచీగా మాసీగా ఉంది. దాంతో పాటు కొత్తగానూ ఉంది. రవితేజ నుంచి ఏమేం కోరుకొంటారో.. అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా మేళవించి తీస్తున్నామని దర్శక నిర్మాతలు మాటిస్తున్నారు. దానికి తోడు పోస్టర్లలో రవితేజ లుక్.. సూపర్బ్‌గా ఉంది. గత సినిమాల్లో ముసలి ఛాయలు కనిపించకుండా.. జాగ్రత్తపడ్డాడీ చంటిగాడు. మొత్తానికి జనవరి 26న తన పుట్టిన రోజు సందర్భంగా మంచి గిఫ్టే ఇచ్చాడు తన ఫ్యాన్స్‌కి.