దర్శకుడిగా లోకేష్ కనగరాజ్‌కి స్టార్ డమ్ వచ్చేసింది. బడా హీరోలతో ప్రాజెక్టులు ఫైనల్ అవుతున్నాయి. ఒక్కో సినిమాకు కనీసం యేడాది తీసుకొంటున్నారు. ఈలోగా తన కథల్ని మిగిలిన దర్శకులకు ఇచ్చి ‘సేల్’ చేసుకొంటున్నారు. అందులో భాగంగా లారెన్స్‌కు ఓ కథ ఇచ్చేశారు. అదే ‘బెంజ్’.
ఈ చిత్రానికి భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇది వరకు ‘రెమో’, ‘సుల్తాన్’ చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రెండూ యావరేజ్ మార్క్ దగ్గరే ఆగిపోయాయి. అయితే.. ఇది లోకేష్ కథ. కాబట్టి.. కచ్చితంగా ఎగస్ట్రా మైలేజ్ దక్కే అవకాశం ఉంది. `బెంజ్` అనే క్యాచీ టైటిల్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రమేష్ వర్మ కూడా లారెన్స్ కోసం ఓ కథ రెడీ చేసేశారు. ఆ సినిమా కోసం `శ్రీరామ రాక్ష` అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. స్క్రిప్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. `బెంజ్` పూర్తయిన వెంటనే… రమేష్ వర్మ సినిమా పట్టాలెక్కేఅవకాశం ఉంది.