ఏపీ హైకోర్టు విచారణల్లో ఓ వైపరీత్యం చోటు చేసుకుంది. శుక్రవారం ఓ ధర్మాసనం మీద జరుగుతున్న విచారణణలో ఆన్ లైన్ లో ఓ వ్యక్తి లాగిన్ అయ్యాడు. ఆ వ్యక్తి తన ల్యాప్ ట్యాప్ లో కెమెరా ఆన్ చేసి తాను మాత్రం నగ్నంగా మంచం మీద పడుకున్నాడు. ఈ దృశ్యాలు చూసి న్యాయమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ లాగిన్ ను బ్లాక్ చేశారు. ఈ లాగిన్ ఎవరిది.. ఎందుకు ఇలా చేశారో పోలీసులు ఆరా తీస్తు్న్నారు.
కరోనా తరవాత హైకోర్టు ఆన్ లైన్ విచారణలకు అవకాశం కల్పించింది. దాన్నో అలుసుగా తీసుకుంటున్నారు చాలా మంది. పక్కనే కోర్టు ఉన్నప్పటికి రావడానికి బద్దకిస్తున్నారు. ఆన్ లైన్ లో లాగిన్ అవుతామంటున్నారు. ఇలా విచారణకు సంబంధించిన అనేక కేసుల్లో లాయర్లకు ఆన్ లైన్ లాగిన్ ఇస్తున్నారు. ఇలా తీసుకున్న ఓ లాయర్… ఈ తప్పుడు పనికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. న్యాయవ్యవస్థ అంటే అలుసుగా తీసుకునేవారి వల్లనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి.
హైకోర్టు విచారణలో నగ్నంగా ఉన్న లాయర్ ఎవరో పోలీసులకు తెలుసు. న్యాయవాదులకూ తెలుసు. అయితే అంతా గుసగుసల్లోనే ఉన్నారు. సాధారణంగా ఏపీ హైకోర్టు విచారణ లాగిన్లను దుర్వినియోగం చేయడానికి భయపడతారు. ఆ భయం కొనసాగేలా అతనికి ట్రీట్ మెంట్ ఇవ్వాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.