అనుకున్నట్లుగానే తెలంగాణ నుంచి రాజ్యసభకు ఒకరికి చాన్స్ ఇచ్చింది బీజేపీ హైకమాండ్. ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా ఉన్న లక్ష్మణ్‌కు రాజ్యసభకు అవకాశం కల్పించిది. నామినేషన్లకు ఈ రోజే ఆఖరు కావడంతో ఆయన లక్నోలో నామినేషన్ వేయనున్నారు. తెలంగాణ నుంచి బీజేపీలో ఒక్కరికి చాన్స్ ఇస్తారని గతంలోనే తేలింది. ఎవరు ఆ అదృష్టవంతులు అన్న చర్చ కూడా జరిగింది. లక్ష్మణ్, విజయశాంతి, మురళిధర్ రావుల్లో ఒకరికి చాన్స్ దక్కుతుందని అనుకున్నారు.
ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి వచ్చి కీలక బాధ్యతలు నిర్వర్తిచిన మురళీధర్ రావు ఇటీవలి కాలంలో ఖాళీగా ఉన్నారు. ఆయనకు పార్టీ పదవులు కూడా తీసేశారు. ఇలాంటి పరిస్థితి భరించలేక రామ్ మాధవ్ మళ్లీ ఆరెస్సెస్‌కు వెళ్లిపోయారు. మురళీధర్ రావు మాత్రం ఏదో ఓ పదవి వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఆయన రాజ్యసభ స్థానం కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అమిత్ షాతో భేటీ అయినప్పటికీ ఆయన పేరు ఖరారు కాలేదు.
వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మున్నూరుకాపు ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఆ వర్గం టీఆర్ఎస్పై అసంతృప్తితో ఉందని భావిస్తున్న బీజేపీ.. దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లక్ష్మణ్‌కు చాన్సిచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఏపీ నుంచి ఒక్కరు కూడా లేరు. ఏపీ నుంచి ఎవరికైనా చాన్సిచ్చి కేంద్రమంత్రి పదవి ఇస్తారేమో అనుకున్నారు. అయితే ఏపీపై బీజేపీ ఎలాంటి ఆశలు పెట్టుకోలేదని తేలిపోయింది.