డొనాల్డ్ ట్రంప్ ముందూ వెనుకా చూడని నిర్ణయాల కారణంగా ప్రపంచం మొత్తం అనేక రంగాలు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటి వరకూ కాస్త సేఫ్ ఇండస్ట్రీ అనుకున్న ఫార్మాలోనూ లే ఆఫ్స్ ప్రక్రియ ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దిగ్గజ సంస్థ రెడ్డీస్ ల్యాబ్స్ తమ మ్యాన్ పవర్ ఖర్చులో పాతిక శాతం వరకూ తగ్గించుకోవాలని నిర్ణయించింది. కోటి రూపాయలకుపైగా వార్షిక వేతనం పొందుతున్నవారికీ ఉద్వాసన చెప్పాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
డాక్టర్ రెడ్డీస్ పరిస్థితే ఇలా ఉంటే.. ఇతర ఫార్మా కంపెనీల గురించి చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు ట్రంప్ టారిఫ్ల ఒత్తిడి మరో వైపు పెరిగిపోతున్న పోటీ మధ్య కంపెనీలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఓ రంగంపై పెను ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటే.. మరో రంగంపైనా ప్రభావాలు కనిపిస్తాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థలో ఫార్మా రంగానిదీ కీలక పాత్ర. భారత్ నుంచి ఎత్తున ఫార్మా ఎగుమతలు ఇతర దేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్తున్నాయి.
ఇప్పటికే ఐటీ రంగం ఒత్తిడి ఎదుర్కొంటోంది. సీనియర్లను తగ్గించుకుని జూనియర్లతో హెడ్ కౌంట్ ను మెయిన్ టెయిన్ చేయాలని కంపెనీలు భావిస్తున్నారు. ఫ్రెషర్లకు అవకాశాలు వస్తున్నా.. సీనియర్లకు మాత్రం సమస్యలు వస్తున్నాయి. ఫార్మా రంగంలోనూ ఇలాంటి పరిస్థితి రావడం ఇబ్బందికరమే.