పదకొండో తేదీ నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు పదకొండు మంది ఎమ్మెల్యేలు వస్తారా లేదా అన్నదానిపై సందిగ్దత ఉంది. జగన్ రెడ్డికి అసెంబ్లీలో టీడీపీని ఎదుర్కొనేందుకు భయపడుతున్నారు. ఎమ్మెల్యే పదవి పోతుందన్న భయంతో ఆయన ప్రమాణస్వీకారానికి వెళ్లి ముళ్ల మీద నిల్చున్నట్లుగా నిల్చుని ప్రమాణం చేసి కనీసం కూర్చోకుండా వెళ్లిపోయారు.ఇప్పుడు బడ్జెట్ పెట్టడానికి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. మరి హాజరవుతారా ?
ప్రజాతీర్పును గౌరవించడం రాజకీయ నాయకుడి మొదటి లక్షణం
ప్రజా తీర్పును గౌరవించడం రాజకీయనాయకుడి మొదటి విధి. రాజకీయాల్లో ఎలాంటి పదవులు వచ్చినా అది ప్రజల భిక్షే. వారిచ్చిన. పాత్ర పోషించడానికి రెడీగా ఉంటేనే రాజకీయాల్లో ఉండాలి. అలా కాదు.. నేను కోరుకున్న పదవే ఇవ్వాలి అంటే సాధ్యం కాదు. వారిచ్చిన రోల్‌తో వారిని మెప్పించే ప్రయత్నం చేయాలి. కానీ జగన్ రెడ్డి అలా చేసేందుకు సిద్ధంగా లేరు. ఆయన ప్రభుత్వాన్ని ఫేస్ చేసేందుకు అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధంగా లేరు. అసెంబ్లీలో పోరాడకుండా రోడ్ల మీద డ్రామాలు వేస్తే అది పోరాటం ఎలా అవుతుంది ?
నాడు ప్రతిపక్ష నేతల్ని అవమానించడం ఎందుకు ? నేడు భయపడటం ఎందుకు ?
చంద్రబాబుకు 23 మంది ఎమ్మెల్యేల్ని ఇచ్చినా ఆయన ప్రజాతీర్పును ఎప్పుడూ అగౌరవపర్చలేదు. అసెంబ్లీకి వెళ్లారు. అధికార మదంతో ఆయనను అవమానించినా తట్టుకుని నిలబడ్డారు. అందర్నీ సస్పెండ్ చేసి సభలో ఒక్కడ్నే ఉంచినా ధైర్యంగా నిలబడ్డారు. చివరికి ఆయన భార్యను.. కుటుంబాన్ని కూడా అనకూడని మాటలతో అవమానించడంతో కన్నీరు పెట్టుకుని శపథం చేసి వెళ్లారు. తననూ అలా చేస్తారన్న భయంతోనే జగన్ రెడ్డి వెళ్లడం లేదు. అలా చేస్తే ఆయన కూడా కన్నీరు పెట్టుకుని బాయ్ కాట్ చేస్తే ఓ జస్టిఫికేషన్ ఉంటుంది.
రోడ్లపై డ్రామాలేయడం ప్రతిపక్ష పాత్ర కాదు !
జగన్ రెడ్డి పనితీరును ప్రజలు ఒక్క సారి చూశారు. మరో ముఫ్ఫై ఏళ్ల పాటు పీడకలలు వచ్చేలా పరిపాలించారు. ఆయన పనితీరు మర్చిపోవాలంటే ప్రతిపక్ష నేతగా ప్రజల కోసం ఆయన పోరాడాల్సింది చాలా ఉంది. అలా కాకుండా పారిపోయి.. రోడ్ల మీద డ్రామాలు చేసి..శవాలున్న ఇళ్లలోనే అడ్డగోలు అబద్దాలు చెప్పి ప్రజల్ని మోసగించేస్తానని అనుకుంటే అంత కంటే అమాయకులు ఉండరు.