పార్టీని ధిక్కరించిన వారిని ఉపేక్షించబోమని నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుకు సిఫారసు చేసింది. ఫిరాయింపులు ఎక్కువ అవుతూండటంతో మిగిలిన వారిని భయపెట్టడానికి పార్టీకి దూరం అయిన నలుగురు ఎమ్మెల్యేలు, ఇటీవల పార్టీకి గుడ్ బై చెప్పిన ఇద్దరు ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేయాలని స్పీకర్, మండలి చైర్మన్లకు ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేశారని నలుగురు ఎమ్మెల్యేలపై ఇప్పటికే సస్పెన్షన్ వేటు వేశారు. అనర్హతా వేట వేయలేదు. అప్పట్లో అనర్హతా వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తాయనో.. లేకపోతే సాంకేతికంగా అనర్హతా వేటు చెల్లదన్న అనుమానం కారణంగానో లైట్ తీసుకున్నారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ నలుగురిపై అనర్హతా వేటు వేయలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
ఇటీవల ఇద్దరు ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయించారు. శాసనసభ్యలు కోటాలో ఎన్నికయిన వంశీకృష్ణ యాదవ్ తో పాటు సి. రామచంద్రయ్య కూడా పార్టీని వీడారు. ఒకరు జనసేనలో మరొకరు.. టీడీపీలో చేరిపోయారు. వారికి తలా మూడేళ్ల వరకూ పదవి కాలం ఉంది. వీరిపైనా అనర్హతా వేటు వేయాలని మండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది.
ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసినా ..వేయకపోయినా ఒకటే. ఎందుకంటే.. మరో నెలన్నర రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది కాబట్టి.. ఆ ఎమ్మెల్యేలకు పోయేదేమీ ఉండదు. అయితే ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు వేస్తే ఉపఎన్నికలు వస్తాయి. అవి కొత్త అసెంబ్లీ ఏర్పడిన తర్వాతనే వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి ఆ సీట్నలు భర్త చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఫిర్యాదు మాత్రమే చేశారు.. స్పీకర్, మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. స్పీకర్ వద్ద ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలపై టీడీపీ,జనసేన చేసిన ఫిర్యాదులు ఉన్నాయి. వాటిపై నిర్ణయం తీసుకోలేదు. వాటిని పక్కన పెట్టి.. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులపై స్పందిస్తారా..అందరిపై వేటు వేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఒక వేళ వైసీపీలో చేరిన వారిపై చర్యలు తీసుకోకపోతే.. చట్టాన్ని దుర్వినియోగపరిచినట్లే అవుతుంది. అది వైసీపీకి అలవాటే అయినా.. ప్రజల ముందు వారి తప్పుడు పనులు సాక్ష్యాలతో సహా ఉన్నట్లవుతుంది.