ఆ నిర్ణయంలో నిజాయితీ లేదు. ఆ నిర్ణయంలో ప్రజాస్వామ్యం లేదు. ఆ నిర్ణయంలో అంతా స్వార్థమే. తప్పుడు ప్రకటనలు.. తప్పుడు ఆరోపణలతో ఏదో చేయాలనుకున్నారు. కానీ ఏ విషయంలోనూ వారి తీరు సక్సెస్ కాలేదు. ఎప్పటికప్పుడు దారుణంగా ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు. కానీ ఇప్పటికీ అసలు బుద్దిరాలేదు. ఇంకా ముందుకెళ్తూనే ఉన్నారు. దానికి కారణం అధికారం. అధికారం అనే మత్తు నెత్తికెక్కిన తర్వాత అది దిగిపోయేవరకూ చాలా మంది ఎక్కడో ఉంటారు. ఇప్పుడు ఏపీ పాలకుల స్థితి అదే. అమరావతి విషయంలో వారు వ్యవహరిస్తున్న తీరే దీనికి నిదర్శనం.
వెయ్యి రోజులుగా అమరావతి రైతులకు కన్నీళ్లు !
వారంతా అమరావతిరైతులు. ఏపీ కి రాజధాని వస్తుందంటే… అందులో తాము భాగం అవుతామని వేల మంది భూములిచ్చారు. దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా ఇలా భూములిస్తున్న దాఖలాలు లేవు. కానీ అమరావతి రైతులిచ్చారు. ఏపీ రాజధాని కోసం. కానీ వారికి ఏం మిగిలిదింది .. గత మూడేళ్లుగా లాఠీదెబ్బలు.. కేసులు.. వైసీపీ నేతల నుంచి బూతులే మిగిలాయి. కానీ రాజధాని వస్తే వారికేదో వస్తుందని వారంతా కమ్మవాళ్లని ప్రచారం చేసి ఇతర చోట్ల ప్రజల్ని రెచ్చగొట్టారు ఏపీ పాలకులు. పాలించేవాడు ఇలాంటి మూర్ఖత్వంతో ఉంటే ప్రజలు ఎవరికైనా కష్టాలు తప్పవు… ఒకరోజు అటూ..ఒక రోజు ఇటూ అంతే తేడా.. వెయ్యి రోజుల కిందట అమరావతి రైతుల కన్నీళ్లతో ప్రారంభమైన కష్టాలు ఇప్పుడు అందరికీ తెలుసతున్నాయి.
ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయినా అర్థం కావడం లేదా ?
అమరావతి నిర్మయం తీసుకుని వెయ్యి రోజులైంది. కానీ పాలకుడు ఒక్క అడుగు ముందు వేయలేకపోగా.. ఇంకా అమరావతిని పటిష్టం చేశారు. హైకోర్టు రిట్ ఆఫ్ మాండమస్ తీర్పు ఇచ్చింది అంటే… అమరావతిని నిర్మించి తీరాల్సిందేనని శాసనం. కానీ అధికారం మత్తులో ఉన్న పాలకులకు ఇది కనిపించడం లేదు. తాము ఏదైనా చేయగలమని విర్రవీగుతున్నారు. మూడు రాజధానుల బిల్లు పెడతాం ఆపుకోండి అని సవాల్ చేస్తున్నారు. వీరందరికీ అధికార మత్తు పూర్తి స్థాయిలో ఎక్కి ఉంది. వారికి అధికారం వచ్చింది రాజ్యాంగం ద్వారా.. ఆ రాజ్యాంగాన్నే వారు అలా పరిహసిస్తున్నారు. ఇవన్నీ పతనానికి సూచనలే కానీ.. పాలనకు కాదు. ఏ విషయంలోనూ సక్సెస్ కాకపోయినా పాలకులకు తాము తప్పు చేస్తున్నామని అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఎక్కడైనా అంతిమ విజయం రైతులదే !
ఢిల్లీలో ప్రధాని మోడీ సాగు చట్టాలు తెచ్చారు. ఆ సాగు చట్టాలు రైతులకు మేలు చేస్తాయని ఎక్కువ మంది నమ్మారు. కానీ అందులో కుట్ర ఉందని రైతులు రోడ్డెక్కారు. చివరికి వారి ఆగ్రహానికి మోదీ తలవంచారు. మోదీ ఎంత బలమైన నాయకుడో మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయనే వెనక్కి తగ్గాడు.,. ఇక రాష్ట్రంలో పాలకుడు ఎంత ? అక్కడైనా ఇక్కడైనా.. రైతులదే అంతిమ విజయం… జరగబోయేది అదే. అమరావతి రైతులు.. భూములిచ్చి మాత్రమే కాదు.. తమ పోరాటాలతో రాజధానిని నిలుపుకున్న పోరాటయోధులుగా చరిత్రలో నిలిచిపోతారు.