జగన్ రెడ్డిని ఏ కోణంలో చూసి నమ్మారో కానీ.. ఆయనను నమ్మి గౌరవంగా బతకాల్సిన అధికారులు వేషాలు మార్చుకుని పరారు కావాల్సి వస్తోంది. లిక్కర్ స్కాం వాసుదెవరెడ్డి గుండు చేయించుకుని ఎవరికి కనిపించకుండా ఎక్కడ దాక్కున్నారో కానీ .. ఎక్కడ అలికిడి వినిపించినా ఉలిక్కి పడుతూ ఉండటం మాత్రం ఖాయం. ఇక కోస్ట్ గార్డ్ లో గౌరవంగా బతికే వెంకటరెడ్డి షిప్పులో పరాయిదేశం పారిపోవాల్సి వచ్చింది. కోస్ట్ గార్డ్ ఉద్యోగికి ఈ ఖర్మ పట్టాడనికి కారణం ఆయన జగన్ ను నమ్మడమే. వీరిద్దరనే… ఇప్పుడు వైసీపీలో ఉండి.. జగన్ ను నమ్మి పరారైన వారి లెక్క తీస్తే… రాసుకుంటూనే ఉండాలి.
ఇక పారిపోలేక.. పోస్టింగుల్లేక.. కేసుల పాలయ్యే అధికారుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఉజ్వలమైన భవిష్యత్ ఉన్న వారికి పోస్టింగులు ఆశ చూపి .. అందరి జీవితాల్ని నాశనం చేశారు. అలా ఆశపడటం కూడా వారి తప్పే. కానీ.. కాను ముప్ఫై ఏళ్లు సీఎంగా ఉంటానని నమ్మించడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఇలా అందరూ.. జగన్ ను నమ్ముకుని వచ్చి వారంతా అవినీతి కేసుల్లో ఇరుక్కుంటున్నారు. వీరందరికీ అవినీతిలో జగన్ ఒక శాతం.. రెండు శాతమో వాటా ఇచ్చి ఉంటారు. మిగతా అంతా ఆయనే వెనకేసుకున్నారు. కానీ ఆయన మాత్రం.. సఫ్ గానే ఉన్నారు. మిగతా వారంతా పరారీ కావాల్సి వచ్చింది.
జగన్ రెడ్డి లాంటి అవినీతి పరుడ్ని నమ్ముకుంటే… గౌరవనీయమైన జీవితాలుకూడా.. రోడ్డున పడి పరువు పోగొట్టుకుని ఆజ్ఞాతంలో బతకాల్సి వస్తుంది. దానికి ఇప్పుడు సాక్ష్యంతో ఎంతో మంది కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఉజ్వలమైన భ విష్యత్ ఉండాల్సిన శ్రీలక్ష్మి అనే అధికారిణి అత్యంత ఘోరమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్నారు. అలాంటి వారిలో మార్పు రాదని.. జగన్ సీఎం అయ్యాక.. రెండేళ్లు ఢిల్లీలో విజయసాయిరెడ్డితో పాటు తిరిగి తిరిగి.. ఏపీకి క్యాడర్ మార్పించుకున్న వైనమే స్పష్టమవుతుంది. రెండో సారి జగన్ నమ్మడమే ఆమె లాంటి వారిలో మార్పు రాదని తేలియచేస్తుంది.
మొత్తంగా కాస్త గౌరవంగా ఉండాలంటే… నేరస్తులకు.. క్రిమినల్ మనస్థత్వం ఉన్న వారికి దూరంగా ఉండాలి. మనోడే అనుకుని వస్తే… సాంతం నాకించేసి జైలుకు పంపించేస్తాడు. ఆలోచించుకోవాల్సిన విషయం ఇది.