వైసీపీ నేతలు ఎంత మంది ముందస్తు బెయిల్స్ కోసం కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు. ఎంత మంది పరారీలో ఉన్నారో లెక్కలేదు. ఎంత మంది అధికారులు తమ కెరీర్ ను రిస్కులో పెట్టుకున్నారో చెప్పాల్సిన పని లేదు. వారంతా ఏం చేశారు?. జగన్ రెడ్డి మానసిక ఆనందం కోసమే తప్పులు చేశారు. జగన్ రెడ్డి తన ఈగో ను సంతృప్తి పరుచుకోవడానికి చేసిన పనుల వల్లే వాళ్లంతా జైలుకు వెళ్తున్నారు. పరారీలో ఉంటున్నారు.
జగన్ రెడ్డిది వికృత మనస్థత్వం. చేయాల్సినంత అవినీతి చేయడం కాదు.. అధికారం ఉందని తన ప్రత్యర్థుల్ని హింసించాలనుకునే మనస్థత్వం. రఘురామ కృష్ణరాజు దగ్గర నుంచి చంద్రబాబు వరకూ అందరిపైనా తన వికృత మనస్థత్వం చూపించుకున్నారు. అలా చేయడానికి అధికారుల్ని పావుగా వాడుకున్నారు. ఫలితంగా అందరూ జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది. ఆనందం పొందిన జగన్ రెడ్డి హాయిగా ఉన్నారు. అధికారులు మాత్రమే కాదు ఈ రోజు వైసీపీ నేతలు ఎందుకు ముందస్తు బెయిల్స్ కోసం పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఎందుకు అజ్ఞాతంలోకి పోవాల్సిన వస్తోంది?. ఇదంతా జగన్ రెడ్డి ఈగో శాటిస్ ఫేక్షన్ కోసం చేసిన రాజకీయాలే.
జగన్ రెడ్డిని నమ్ముకుంటే నాలుగు కాసులు దొంగతనంగా సంపాదించుకునే అవకాశం కొంత మందికి వస్తుంది. ప్రజాధనం దోచుకోవడానికి అవకాశం ఇస్తారు. కానీ అన్నీ నేరుగా దొరికిపోయేలా ఉంటాయి. సీఐడీలో అక్రమాలకు పాల్పడిన సంజయ్ కు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఇచ్చారు. అది ఈజీగా దొరికిపోయేదే. ఆయన దొరికిపోయాడు. జైలుకెళ్లడానికి రెడీగా ఉంటున్నారు. ఓ మహిళా డాక్టర్ పరారీలో ఉన్నారు. ఇలాంటి వారు వందల మంది ఉంటారు. జగన్ రెడ్డి కేవలం తన పార్టీ.. ఈగో కోసం.. నేతల్ని వాడుకుంటారు. తర్వాత వారి ఎలా పోయినా పట్టించుకోరు. గత పదిహేనేళ్లుగా ఇదే నిరూపితమవుతోంది. ఇంకా ఇంకా ఆయనను నమ్ముకునేవాళ్లు ఎకరాలు కాక ఇంకెవరు?