హైదరాబాద్: డెన్మార్క్‌లో జరిపిన ఒక అధ్యయనంలో ఫేస్బుక్ వాడుతున్నవారి కంటే వాడటం నిలిపేసినవారు సంతోషంగా ఉన్నట్లు తేలింది. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగన్‌కు చెందిన ‘హ్యాపీనెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’ అనే సంస్థ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. అన్ని వయసులవారూ ఉపయోగించే సోషల్ మీడియా కాబట్టి ఫేస్‌బుక్‌ను తాము ఎంచుకున్నామని వివరించింది. డెన్మార్క్‌లోని 1,095 మంది వ్యక్తులను తీసుకుని ఈ అధ్యయనం చేసింది. ముందుగా వారిని రెండుగా విభజించింది. ఫేస్బుక్లో ఉన్నవారిని ఒకవైపు, వాడటం ఆపేసిన వారిని మరొక వైపు తీసుకుని ఈ సర్వే చేసింది. ఒక వారం పాటు అధ్యయనం చేసిన తర్వాత, ఫేస్బుక్ వాడటం ఆపేసినవారిలో 88 శాతం మంది తమ జీవితాలతో తాము ముందుకంటే సంతృప్తికరంగా ఉన్నామని చెప్పారు. తమ సోషల్ లైఫ్, ఏకాగ్రత కూడా మెరుగుపడ్డాయని వెల్లడించారు. అధ్యయనం నిర్వహించిన వారు ఈ పరిణామంపై స్పందిస్తూ, తమకు ఏమి అవసరమో వాటిపై దృష్టి కేంద్రీకరించకుండా, ఇతరుల వద్ద ఉన్నవాటిపై దృష్టి పెట్టటం వలనే ఇలా జరుగుతోందని అన్నారు. అందువలనే ఫేస్బుక్లో ఉన్నవారు ఎక్కువగా అసూయతో, ఏకాగ్రతా లేమితోనూ బాధపడుతుంటారని చెప్పారు. మొత్తం మీద చూస్తే ఫేస్బుక్లో ఉన్నవారు, లేనివారికంటే 39 శాతం తక్కువ సంతోషంగా ఉన్నారని తేల్చారు