విశాఖ మెట్రో పాలిటన్ సిటీ. విశాఖ కన్నా చిన్న సిటీల్లో మెట్రో వచ్చింది. కానీ విశాఖలో మాత్రం రాలేదు. గత ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను ఈ ప్రభుత్వం కొనసాగించకపోవడం.. కనీసం పైసా కూడా కేటాయించకపోవడంతో మెట్రో అనేది విశాఖకు కలగా మిగిలిపోయింది. 2019 ఎన్నికల సమయంలో విశాఖకు రైల్వే జోన్ అంటూ మోడీ సర్కారు ప్రకటన చేసింది. కేంద్రం కోరిన మీదట విశాఖకు మెట్రో రైలుపై రూ.18వేల కోట్లు అవసరమవుతుందని చంద్రబాబు ప్రభుత్వం నివేదిక పంపింది. ఫాలో అప్ చేసుకోవాల్నిన జగన్ ప్రభుత్వం పూర్తిగా లైట్ తీసుకుంది.
విజయవాడలో ఉన్న ఎపి మెట్రో రైల్ ప్రాజెక్టు కార్యాలయాన్ని 2020లో విశాఖకు తరలించి 2024 కల్లా మెట్రో పూర్తవుతుందని ప్రకటించారు. ఆ దిశగా ఒక్క పనీ మొదలవ్వలేదు. మెట్రో కార్యాలయం అయితే పెట్టి అంతటితో పనైపోయిందంటూ చేతులు దులిపేసుకుంది. దేశం మొత్తం మీద ఎపి, ఒడిశాలో మాత్రమే మెట్రో రైలు లేని ‘అర్బన్ సిటీస్’ ఉన్నాయి.
చంద్రబాబు హయాంలో విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ ఏరియాలో 79.91 కి.మీ. లైట్ మెట్రో రైలు కారిడార్లు, 60 కి.మీ మేర మోడ్రన్ ట్రామ్ కారిడార్ల అభివృద్ధి కోసం ఆనాడే మాస్టర్ ప్లాన్, డిపిఆర్ తయారుచేశారు. లైట్ మెట్రో, మోడ్రన్ ట్రామ్‌ల నిమిత్తం రెండు డిపిఆర్లు వేర్వేరుగా తయారుచేసి ట్రాఫిక్ ఇతర అంశాలపై అధ్యయనం చేసిన అనంతరం 75.31 కిలోమీటర్లలో 4 కారిడార్లలో 52 స్టేషన్లను ఏర్పాటు చేయాలని నాటి కన్సల్టెంట్లు ఎపి ప్రభుత్వానికి, కేంద్రానికి సిఫారసు చేశారు. 2017 డిసెంబరులో మధురవాడ నుంచి గాజువాక 44 కి.మీ మెట్రో వేసేందుకు విజయవాడ-విశాఖ రైల్వే అధికారులతో చంద్రబాబు ప్రభుత్వం చర్చించింది.
విశాఖలో 2028 సంవత్సరం నాటికి 144 కి.మీ మెట్రో పూర్తికావాలనే లక్ష్యాలను సైతం చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ప్రభుత్వం ఆ కసరత్తును ముందుకు తీసుకెళ్లినా విశాఖ మెట్రోకు ఓ రూపు వచ్చేది. కానీ పంచడానికే పరిమితమైన ప్రభుత్వం .. కనీసం రోడ్లపై గుంతలు పూడ్చడం లేదు.. ఇక మెట్రోనా..?