జగన్ రెడ్డిని నమ్మి ఇష్టం వచ్చినట్లుగా నోరు పారేసుకున్న పోసాని కృష్ణమురళి కేసులు నమోదు కావడంతో అరెస్టు కాకుండా కొత్త డ్రామాలు ప్రారంభించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని ఆరోగ్యం బాగయ్యాక తానే పోలీసుల వద్దకు వస్తానని చెబుతున్నారు. అంతేనా తనకు పోలీసులు వాట్సాప్ లో నోటీసులు పంపించి… తర్వాత వెంటనే అరెస్టు చేస్తారన్న భయంతో తనకు స్మార్ట్ ఫోన్ లేదని..కొంత మంది మీడియా ప్రతినిధులను మైహోమ్ భూజాలోని తన ఇంటికి పిలిపించి ప్రత్యేకంగా చెబుతున్నారు. పోసాని తెలివి తేటల్ని గుర్తించక వారు.. అబ్బా పోసాని చాలా సింపుల్ అని ప్రచారం చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ కుటుంబాన్ని,చంద్రబాబు కుటుంబాన్ని , లోకేష్‌ను ఇతరుల్ని నోటికి వచ్చినట్లుగా దూషించినప్పుడు ఆయనకు అనారోగ్యం లేదు. వైసీపీ ఆఫీసు నుంచి స్క్రిప్టులు అందుకున్నప్పుడు ఆయనకు స్మార్ట్ ఫోన్ లేదు. ఇలాంటి కబుర్లు చెబుతూ ఎవర్ని మోసం చేయాలనుకుంటున్నారో కానీ.. తనను తాను స్మార్ట్ అని ఆయన అనుకుంటున్నారు కానీ పోలీసులు అంత కంటే స్మార్ట్. ఆరోగ్యం బాగోలేదని ఎన్ని నాటకాలేసినా చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి. ఎవరూ తప్పించుకోలేరు.
నోరు ఉంది కదా అని ఇతరుల కుటుంబాలను ఇష్టం వచ్చినట్లుగా .. డబ్బులు తీసుకుని దూషిస్తామంటే ఎవరు ఊరుకుంటారు ?. ఇప్పుడు పోసానికి పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ఆయన మైహోమ్ భూజాలో ఉన్నా.. మరో చోట ఉన్నా…పోలీసుల చేతికి దగ్గరగానే ఉంటారు. చట్టం ఎంత పవర్ ఫుల్లో చూపిస్తారు. మరొకరు డబ్బులకు కక్కుర్తి పడి ఇతరుల కుటుంబాలను తిట్టకుండా పోసానిని ఉదాహరణగా తీసుకునేలా ట్రీట్మెంట్ ఇస్తారు.