సీఎం క్యాంప్ ఆఫీసును పార్టీ ఆఫీసుగా మార్చేసుకుని దర్జాగా ప్రజాధనంతో కొన్ని ఫర్నచర్ వాడేసుకుంటున్న జగన్ రెడ్డిపై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమయిందన్న సమాచారం వచ్చిందేమో కానీ హడావుడిగా ఆ పార్టీకి చెందిన లేళ్ల అప్పరెడ్డి ఓ లేఖను మీడియాకు రిలీజ్ చేశారు. అది జీఏడీకి రాసినట్లుగా చెప్పుకొచ్చారు. అందులో ఏముందంటే.. ఫర్నీచర్ ఉంది తీసుకెళ్లాలని ఒక వేళ తీసుకెళ్లకపోతే తాము ఖరీదు చేస్తామని ఉంది. గతంలో మూడు సార్లు లేఖలు రాశామని స్పందించలేదని ఆ లేఖల తేదీల్ని కూడా లేఖలో పేర్కొన్నారు.
నిజానికి అది ప్రభుత్వ ఫర్నీచర్ .సీఎం క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేశారు. దాన్ని మళ్లీ ప్రభుత్వానికి ఇచ్చేందుకు ఓ పద్దతి ఉంది. ఎవరో ముక్కూ ముఖం తెలియని వ్యక్తి.. ఆఫీసు అటెండర్ లేఖ రాస్తే వచ్చి తీసుకెళ్లిపోతారా ?. తీసుకున్న ఫర్నీచర్ ను భద్రంగా అప్పగించాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై ఉంటుంది. సీఎంవో కోసం అధికారికంగా ఆ ఫర్నీచర్ మొత్తాన్ని కొనుగోలు చేసినందున అంతే అధికారికంగా తిరిగి ఇవ్వాల్సి ఉంది.
కానీ ఎవరో తెలియని గణేష్ రెడ్డి లేఖలు రాశారని.. తాను కూడా ఇప్పుడు లేఖ రాస్తున్నానని అప్పిరెడ్డి చెప్పుకొచ్చారు. నిందలు వేయడానికి తీసుకెళ్లలేదని ఆయన అంటున్నారు. ఏ మాత్రం నైతిక విలువలు ఉన్నా.. క్యాంప్ ఆఫీసుగా వాడి.. ప్రజాధనంతో ఫర్నీచర్ ను వాడుకుంటున్న ఎవరైనా.. పార్టీ ఆఫీసుగా మార్చి దాన్ని వాడుకోరు. ముందుగా ఫర్నీచర్ రూల్స్ ప్రకారం ప్రభుత్వానికి అప్పచెప్పి ఉండేవారు. అలా చేయకండా ఇప్పుడు కేసులు పెడతారేమో అని నంగి నంగిగా లేఖలు రాసి చావు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు.