కేసుల్లో పోలీసులు అరెస్టు చేస్తారని భయపడుతూ ఆజ్ఞాతంలో బతకడం కన్నా లొంగిపోడం బెటరని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నించరు. ఆ ధైర్యంతో బయట ఎక్కడైనా కనిపిస్తే వదిలిపెట్టరు. ఇలాంటి పరిస్థితుల్లో జైలుకు పోయి కొన్ని రోజుల తర్వాతైనా బెయిల్ తెచ్చుకుంటే కుటుంబంతో గడపవచ్చని అనుకుంటున్నారు. తాజాగా గుంటూరు వైసీపీ నేతల లేళ్ల అప్పిరెడ్డి రైట్ హ్యాండ్ పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఈ పానుగంటి నేరుగా దాడిలో పాల్గొన్నారు. అప్పిరెడ్డి దూరంగా కారులో ఉండి ఆదేశాలు ఇస్తూంటే ఈయన మూకను తీసుకెళ్లి దాడులు చేశారు. అందుకే ఈ కేసులో పానుగంటి చైతన్య ఏ వన్ గా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజునే అడ్రస్ లేకుండా పోయారు. ఎక్కడా బెయిల్ రాలేదు. ఇంకా ఆజ్ఞాతంలో ఉండటం కన్నా.. బయటకు వచ్చి లొంగిపోవడం బెటరని ఆ పని చేశారు.
ఇలాంటి నేతలకు వైసీపీలో ఉండే ప్రాధాన్యం ఎలాంటిదంటే.. ఆయన పరారీలో ఉన్నప్పుడే విద్యార్థి విభాగం నేతగా ప్రకటించారు. వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఆయన పేరును జగన్ ప్రకటించారు. ఇప్పుడు ఆయన లొంగిపోయారు. బెయిల్ వచ్చాక బహుశా ఆయన గుంటూరులో సభ పెట్టి సజ్జల ముఖ్య అతిధిగా బాధ్యతలు తీసుకుంటారేమో. పోలీసులు మాత్రం చాలా మంది వైసీపీ నేతల్ని అరెస్టు చేస్తామని అంటారు కానీ.. పట్టించుకోవడం లేదు. వారే వచ్చి లొంగిపోతున్నారు