హైదరాబాద్: ఈ ఏడాది ఆస్కార్ అవార్డ్‌లలో ‘మ్యాడ్ మాక్స్ ఫ్యూరీ’ చిత్రానికి అత్యధికంగా 6 అవార్డులు లభించాయి. టైటానిక్ చిత్రంతో భారతీయులకు కూడా చిరపరిచితుడుగా మారిన లియోనార్డో డికాప్రియో ‘ది రెవనెంట్’ చిత్రానికిగానూ ఉత్తమనటుడిగా ఎంపికయ్యారు. డికాప్రియో తన కెరీర్లో మొత్తం 6 సార్లు ఈ విభాగంలో నామినేట్ కాగా, ఎట్టకేలకు అవార్డ్ సాధించారు. ఉత్తమచిత్రంగా ‘స్పాట్ లైట్’ చిత్రం ఎంపికయింది. ది రెవనెంట్ చిత్రానికి అత్యధికంగా 12 నామినేషన్లు లభించాయి. ఉత్తమనటిగా రూమ్ చిత్రానికి గానూ బ్రీ లార్సన్ ఎంపికయ్యారు. ది రెవనెంట్ చిత్ర దర్శకుడు అలెజాండ్రో ఉత్తమ దర్శకుడు అవార్డ్‌ను గెలుచుకున్నారు. ఉత్తమ విదేశీ చిత్రం అవార్డు హంగరీ చిత్రం సన్ ఆఫ్ సోల్‌కు వెళ్ళింది.
మరోవైపు ఇండో-బ్రిటిష్ ఫిల్మ్ మేకర్ ఆసిఫ్ కపాడియా బెస్ట్ డాక్యుమెంటరీ అవార్డును గెలుచుకోవటం విశేషం. బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంకచోప్రాకు ఆస్కార్ కార్యక్రమంలో రెడ్ కార్పెట్ స్వాగతం లభించటం మరో విశేషమని చెప్పాలి. లేడీ గాగా నాట్యం ఆహూతులను ఆకట్టుకుంది.