ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. అంటే ఓట్లేసే మనమే పాలకులం. ఈ మౌలిక సూత్రాన్ని విస్మరించే మన ప్రతినిధులు అంటే.. మనం ఎన్నుకున్న పాలకులు.. తామే మహారాజులం అన్నట్లుగా పెత్తనం చేస్తారు. ఓ మాట చెప్పి.. అధికారంలోకి వచ్చి మరో అజెండా అమలు చేసి .. మన మధ్య చిచ్చు పెట్టి.. మనల్ని బానిసలుగా చేసుకుని కలకాలం పాలించాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాజకీయాలు రాను రాను పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ఏపీలో అలాంటి పరిస్థితి చాలా ఎక్కువగా ఉంది.
ప్రజల్ని పాలకుడు.. ఓ మాదరిగా కూడా చూడటం లేదు. తనకు తాను మహారాజును అనుకుంటున్నారు. ప్రజలు ఎవరైనా తన కాళ్ల వద్ద ఉండాలనుకుంటున్నారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డగోలుగా దుర్వినియోగం చేసి..ప్రజలకు ఏ వ్యవస్థ మీదా నమ్మకం లేకుండా చేశారు. ప్రజలకు భరోసా లేని పరిస్థితి కల్పించి.. తనను నమ్ముకుంటే సరే లేకపోతే అథోగతి పట్టిస్తానని సవాల్ చేస్తున్నారు. ప్రజలు తాము ఇచ్చిన అధికారంతో తమ నెత్తికెక్కిన డ్యాన్స్ చేస్తున్న అరాచక రూపాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.
ఐదేళ్ల అధికారం చివరి నాటికి ప్రజల ఆస్తుల మీద పూర్తి స్థాయిలో పెత్తనం తెచ్చే చట్టాలతో తెర ముందుకు వచ్చారు. రేపు వాటిని అమలు చేసే విషయంలో జరిగే అరాచకాన్ని ఎవరూ ఆపలేరు. ఎందుకంటే.. వారికి ఉన్న దురుద్దేశంతో మొత్తం వ్యవస్థలన్నింటినీ ఇప్పటికే చెరబట్టారు. అలాంటి పాలకులకు ఒక్క ఓటు వేసినా మన నెత్తి మీద మనచేయి పెట్టుకున్నట్లే.
ఇప్పుడు మళ్లీ ప్రజలకు మళ్లీ అవకాశం వచ్చింది. పాలకుడిగా తమను బానిసలుగా చూస్తున్న వారిని కొనసాగించాలా.. మళ్లీ పాలనను తమ చేతుల్లోకి తీసుకోవాలా అన్నదానికి ఓటు వేసే సందర్భం వచ్చింది. ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. ఆ సూత్రాన్ని విస్మించిన ఏ పాలకుడికైనా సపోర్టు చేస్తే.. మన హక్కుల్ని మనం వదులుకున్నట్లే. వేరేవారికి సర్వం అప్పగించి రోడ్డున పడినట్లే. అందుకే పాలనను మళ్లీ మన చేతుల్లోకి మనం తీసుకుందాం. నియంతను తరిమికొట్టి ప్రజాపాలనను తెచ్చుకుందాం. ప్రజలంటే భయపడేవారికి అవకాశం ఇద్దాం.