విశాఖలోని గోపాలపట్నం వద్ద ఉన్న ఎల్జీ పాలిమర్స్ సంస్థలో రసాయన లీకేజీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రసాయనాలను పీల్చడం ద్వారా అస్వస్థతకు గురై ముగ్గురు చనిపోయారు. దాదాపుగా రెండు వందల మంది.. ఈ గ్యాస్‌ను పీల్చడం ద్వారా.. అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. రోడ్డు పక్కన వారు అలా పడిపోవడంతో.. అంబులెన్స్‌లలో హుహుటిన.. ఆస్పత్రులకు తరలించారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ ముగ్గురు చనిపోయారు. మరో రెండు వందల మందికి చికిత్స అందిస్తున్నారు.
ఎల్జీ సంస్థ నిర్వహిస్తున్న ఎల్జీ పాలిమర్స్ సంస్థ గోపాలపట్నంలో ఉంది. తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో పరిశ్రమ నుంచి రసాయన వాయువు లీకైనట్టు అధికారులు గుర్తించారు. స్టైరైన్ అనే వాయువు లీక్ అయిందని… ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ కారణంగా విశాఖ పరిధిలోని నాలుగైదు కిలోమీటర్ల పరిధిలో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. మైకుల్లో వినిపిస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చిన మహిళలు, చిన్నారులకు ఎక్కువగా ఆరోగ్య పరమైన సమస్యలు వస్తున్నాయి. అక్కడి ప్రజలందర్నీ అధికారులు ఇతర చోటకు తరలిస్తున్నారు.
అయితే లీకైన విషయాన్ని పరిశ్రమలోని సిబ్బంది గుర్తించకపోవడం.. తక్షణ చర్యలు తీసుకోకపోవడంతో.. అది గాల్లోకి కలిసిపోవడం ప్రారంభమైంది. దాదాలుగా మూడు గంటల పాటు గ్యాస్ లీకైన తర్వాత గుర్తించారు. అప్పటి నుంచి గ్యాస్ లీక్‌ను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా సాంకేతిక సిబ్బంది కూడా.. అందుబాటులో లేకపోవడంతో… పరిస్థితి విషమించించింది. ఎల్జీ పాలిమర్స్ ..సంస్థలో.. లాక్డౌన్ కారణంగా ఉత్పత్తి నిలిచిపోయింది. కార్మికులు విధుల్లోకి రావడం లేదు. ఏపీ సర్కార్ కేంద్ర విధివిధానాల ప్రకారం.. కొంత మందితో పనులు చేయించేందుకు అనుమతి ఇవ్వడంతో మళ్లీ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఎల్జీ పాలిమర్స్ ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా నెల రోజల పాటు… యంత్రాలను అలా ఉంచడం.. గ్యాస్ వాడకాన్ని నిలిపివేయడం.. మెయిన్టెన్స్ లేకపోవడంతో.. తప్పు జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ వెంటనే ఆరా తీసి.. తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.