ఎల్జీ పాలిమర్స్ బాధితులకు మళ్లీ పరిహారం

జగన్ రెడ్డి హయాంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన మహా విషాదం. వారికి పెద్ద ఎత్తున నష్టపరిహారం ప్రకటించినా.. అరకొరగా ఇచ్చి సరిపెట్టారు. కంపెనీ నుంచి రావాల్సిన పరిహారాన్ని పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. టీడీపీ ప్రభుత్వం రాగానే.. వారికి రావాల్సిన పరిహారం విషయాన్ని ఎల్జీ పాలిరమర్స్ కంపెనీ యాజమాన్యంతో చర్చించి.. విడుదలకు హామీ తీసుకున్నారు. మొత్తంగా ఇంకా రూ. 120 కోట్ల రూపాయలను పరిహారంగా పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో సగం నేరుగా బాధితుల ఖాతాల్లోకి వారికి జరిగిన నష్టాన్ని బట్టి జమ చేశారు .

మిగతా సగంతో విద్య, వైద్య వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రస్తుతానికి ఎల్జీ పాలిమర్స్ ను విశాఖ శివారు ప్రాంతాం నుంచి తొలగించారు. శ్రీసిటీలో పరిశ్రమను ఏర్పాటు చేశారు. గ్రామం మధ్యలో రసాయన పరిశ్రమ ఉండకూడదని నిర్ణయం తీసుకున్నారు. అక్కడ ఎల్జీ మరో పరిశ్రమను స్థాపించే అవకాశాలు ఉన్నాయి. బాధితులకు పరిహరం కోసం.. జగన్ రెడ్డి హయాంలో ..ఎన్నో సంస్థలు పోరాటం చేశాయి. కానీ ప్రభుత్వం అందర్నీ అణచి వేసింది.

ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగిన తర్వాత పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలను పరిశీలించి కఠిన చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వ పెద్దలు తనిఖీల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు పిండుకున్నరన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కారణంగా ఫార్మా పరిశ్రమల్లో ప్రమాదాలు సహజంగా మారాయి. ఇటీవల .. ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి.. రసాయన ప రిశ్రమల్లో జాగ్రత్తల్లో నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరికలు జారీ చేసింది. సోదాలు కూడా ప్రారంభించడంతో ఫార్మా కంపెనీల యజమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

23 నుంచి ‘వీర‌మ‌ల్లు’ సెట్లో ప‌వ‌న్

రాజ‌కీయాల కోసం సినిమాల‌కు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ఇప్పుడు మ‌ళ్లీ మేక‌ప్ వేసుకోనున్నారు. ఆయ‌న చేతిలో మూడు సినిమాలున్నాయి. 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌', 'ఓజీ'తో పాటు 'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు' షూటింగ్...

సందీప్ సినిమాకు భ‌లే రేటు

సందీప్ కిష‌న్ - త్రినాథ‌రావు న‌క్కిన కాంబోలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. దీనికి 'మ‌జాకా' అనే పేరు ప‌రిశీలిస్తున్నారు. రావు ర‌మేష్ కీల‌క పాత్ర‌ధారి. 2025 సంక్రాంతికి విడుద‌ల చేయాల‌న్న‌ది...

తిరుప‌తి ల‌డ్డూ నెయ్యి వివాదం… ఘాటుగా స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం విచారకరమని పేర్కొన్న...

బ‌తుక‌మ్మ‌తో క‌విత రీ ఎంట్రీ ఇస్తారా…?

తెలంగాణ సంస్కృతికి అద్దంప‌ట్టే బతుకమ్మ ఉత్సవాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. బ‌తుక‌మ్మ పండుగ మొద‌ల‌వుతుందంటే చాలు ఉద్య‌మ స‌మ‌యం నుండి ఎమ్మెల్సీ క‌విత హాడావిడి మొద‌లుపెడ‌తారు. ప్ర‌తిసారి తెలంగాణ‌వ్యాప్తంగా జాగృతి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close