పూరి `లైగర్` బాక్సాఫీసు దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమా పరాజయానికి కారణాలెన్నో..? అయితే అందులో చాలా ముఖ్యమైనది.. ఎక్కడికక్కడ లింకులు తెలిగిపోయాయి. సడన్ గా పాట వచ్చి పడిపోవడం, కరీంనగర్ నుంచి వచ్చిన హీరో, హీరోయిన్లకు అక్కడంటూ ఓ ఫ్లాష్ బ్యాక్ లేకపోవడం ఇవన్నీ మైనస్లే. హీరో తండ్రి మొహం కూడా చూపించకుండా తన ఆశయాన్ని సాధించడానికి తల్లీ కొడుకులు ఇద్దరూ చేసే ప్రయత్నాలు ఏమాత్రం రక్తి కట్టలేదు.
`లైగర్`నిడివి 2 గంటల 20 నిమిషాలు. ఇది చాలా షార్ప్ కట్. అయితే ఇంకో అరగంట సినిమా మిగిలే ఉందట. కొన్ని సీన్లు స్క్రిప్టు దశలోనూ, ఇంకొన్ని ఎడిటింగ్ టేబుల్ దగ్గరా లేపేశారు. లైగర్ తండ్రి ఎవరు? తన కథేంటి? అనే ఎపిసోడ్లు పూరి రాసుకొన్నాడు. కానీ తీయలేదు. తీసిన కొన్ని సీన్లు ఎడిటింగ్ లో లేపేశారు. దాంతో కంటిన్యుటీ చాలాచోట్ల మిస్ అయిపోయింది. అవన్నీ ఉంటే సినిమా ఫలితం తారుమారు అయ్యేదని చెప్పలేం గానీ… కనీసం కథంతా ఓ ఆర్డర్లో ఉండేది. ఎత్తేసిన అరగంటలో కూడా విషయం లేకపోతే లైగర్ మరీ రాడ్డు రంబోలాలా తయారయ్యేది.