జాతిరత్నాల్లో చిట్టిగా ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాకే గుర్తుపెట్టుకునే పాత్ర ఆమెకు దక్కింది. దిని తర్వాత కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పిరియన్స్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆమె లీడ్ రోల్ లో వస్తున్న సినిమా లైక్ షేర్ & సబ్స్క్రైబ్. మేర్లపాక గాంధీ, నవంబర్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ నేపధ్యంలో తన ఫ్యూచర్ ప్లాన్స్ గురించి చెప్పింది ఫరియా. ఆమె ప్లానింగ్ చిట్టా పెద్దగానే వుంది.
పాతికేళ్ళు ఇండస్ట్రీలో ఉంటానని చెబుతుంది ఫరియా. ఇంకో ఐదేళ్ళతో పాన్ వరల్డ్ గా వుండాలని, మరో పదేళ్ళలో దర్శకత్వం కూడా చేసే ఆలోచన వుందని తన మనసులో మాట బయటపెట్టింది. ఇపుడు ఆమె చేతిలో మూడు ప్రాజెక్ట్స్ వున్నాయి. తమిళ్ విజయ్ అంటోని, హిందీ వెబ్ సిరిస్, ఒక మలయాళం మూవీ, అలాగే సత్యదేవ్ తో ఒక సినిమా చేయబోతుంది.
”నాకు ఎలాంటి లిమిటేషన్లు లేవు. యాక్షన్, సూపర్ నేచురల్, సైకో థ్రిల్లర్స్ .. ఇలా అన్నీ పాత్రలు చేయాలని వుంది. అయితే ఏ పాత్రని చేసిన రిలేటిబుల్ గా వుండాలి. సినిమా కాకుండా నాటకాలు, డ్యాన్స్ తో పాటు మరికొన్ని కళపై కూడా ఆసక్తివుంది. నా స్కిల్ పై నమ్మకం వుంది. పదేళ్ళ తర్వాత దర్శకత్వం చేస్తాను. ఐదేళ్ళలో పాన్ వరల్డ్ గా వెళ్ళాలి” అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పింది ఫారియ.