సినిమా ఎంత పెద్ద హిట్టయినా నిర్మాతలకు ఇప్పుడు డబ్బులు మిగలడం లేదు. పేపర్‌పై మాత్రమే.. హిట్టు.. చేతికి ఒక్క పైసా కూడా అందడం లేదు. దానికి కారణం.. ఓవర్ బడ్జెట్టే! ఓ సినిమాకి మితిమీరి ఖర్చు చేయడం వల్ల కాస్ట్ ఫెయిల్యూర్స్‌ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఎన్టీఆర్‌కీ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. తన బాద్షా సినిమాకి హిట్ టాక్ వచ్చినా నిర్మాతకు డబ్బులు మిగల్లేదు. టెంపర్ పరిస్థితీ అంతే. నాన్నకు ప్రేమతో వల్ల నిర్మాతకు ఒరిగిందేం లేదు. దానికి కారణం.. ఆయా సినిమాలన్నీ బడ్జెట్ ఫెయిల్యూర్సే. తన తాజా చిత్రం జనతా గ్యారేజ్‌కి ఇలాంటి ఇబ్బంది ఏం రాకూడదని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాని రూ.40 కోట్లలోపు పూర్తి చేయాలని నిర్మాతలకు ముందే గట్టిగా చెప్పేశాడు.
అయితే అది ఆచరణలో సాధ్యం కావడం లేదని టాక్. ఈ సినిమా కోసం కొరటాల దాదాపుగా రూ.10 కోట్ల పారితోషికం తీసుకొన్నాడు. ఎన్టీఆర్‌కీ అంతే ఉంటుంది. మోహన్‌లాల్ భారీగా పారితోషికం అందుకొన్నాడని టాక్. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడూ కోటికి తగ్గడు. ఇతర కాస్ట్ అండ్ క్రూని లెక్కగడితే… మరో ఐదారు కోట్లు ఈజీగా అయిపోతుంది. అంటే.. పారితోషికాల పేరుమీదే రూ.30 కోట్ల ఖర్చు తేలుతోంది. ఇక పది కోట్లలో సినిమా ఏం తీయగలడు?? ఇప్పటికి 40 శాతం కూడా షూటింగ్ పూర్తి కాలేదు. కానీ బడ్జెట్ తడిసి మోపెడవ్వడం మొదలైందట. ఈ విషయంలో ఎన్టీఆర్ కంగారు పడుతున్నాడని, అనవసరమైన హంగామా జోలికి వెళ్లకుండా.. ఉన్న దాంట్లో క్వాలిటీ చూపించమని అంటున్నాడట. మరి అది సాధ్యమయ్యే విషమేనా?? మరోసారి ఎన్టీఆర్ సినిమా రూ.50 కోట్ల బడ్జెట్ దాటితే… గ్యారెజీ రిజల్ట్ కూడా డామేజీ అయ్యే ప్రమాదం ఉంది.