కాటమరాయుడు సినిమాని చుట్టేశారని పవన్ ఫ్యాన్స్ సైతం తెగ బాధపడిపోతున్నారు. ఇంతా పోగేస్తే ఈ సినిమా మేకింగ్‌కి రూ.30 కోట్లు కూడా ఖర్చు కాలేదట. ఈ సినిమాని వీలైనంత తక్కువలో తీయాలి అని పవన్ కల్యాణ్ అల్టిమేట్టం జారీ చేయడం,దాన్ని శరత్ మరార్ తుచ తప్పకుండా ఫాలో అయిపోవడంతో కాటమరాయుడ్ని చీప్‌గా చుట్టేశారు. ఇప్పుడు సరిగ్గా ఇదే ఫార్మెట్ త్రివిక్రమ్ సినిమా విషయంలోనూ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. కాటమరాయుడు అంత కాకపోయినా.. ఈ సినిమానీ వీలైనంత తక్కువలో తీయాలన్నది త్రివిక్రమ్ ప్లాన్. పైగా కథానుసారం పెద్ద పెద్ద సెట్టింగులు అవసరం లేదని తెలుస్తోంది. సినిమా అంతా ఒకట్రెండు సింపుల్ లొకేషన్లలోనే పూర్తయ్యే ఛాన్సుందని సమాచారం. త్రివిక్రమ్ మేకింగ్ స్టైల్ డిఫరెంట్‌గా ఉంటుంది. విజవల్ గా ఆయన సినిమాలు గ్రాండ్‌గా ఉంటాయి. చిన్న చిన్న పాత్రలకు సైతం పెద్ద పెద్ద నటుల్ని తీసుకొంటారు. ఎక్కవ రోజులు షూటింగ్ జరుపుతారు.
అయితే.. ఈ సినిమాని 4 నెలల్లో పూర్తి చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. సెస్టెంబరులో పవన్ సినిమాని విడుదల చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే తక్కువలో తీసినా.. సినిమా రిచ్‌గా ఉండాలని త్రివిక్రమ్ ఆశ పడుతున్నాడని, క్వాలిటీ విషయంలో ఆయన కాంప్రమైజ్ అయ్యే కరం కాదని.. పవన్ కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్ కంట్రోల్ ఎప్పుడూ మంచిదే. నీళ్లలా డబ్బుల్ని వెదజల్లకుండా కథకు తగ్గట్టు ఖర్చు చేయాలి. అయితే అవసరం అనుకొన్న చోట ఓ రూపాయి ఎక్కువ ఖర్చు చేసినా తప్పులేదు. ఇప్పుడు పవన్ సినిమా విషయంలోనూ ఈ లెక్కల్ని ఫాలో అవుతున్నార్ట.